బిగ్‌బాస్‌ ఇంట్లో ముమైత్‌ కోరిక నెరవేరింది

Mumith Khan Was Responsible For The Bigg Boss Show Captaincy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బిగ్‌బాస్‌ షో ఆరంభం అయినప్పటి నుండి కూడా కెప్టెన్‌ కావాలని ముమైత్‌ ఖాన్‌ ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంది. కెప్టెన్‌ కాకుండానే అంతకు ముందు వారం ఆమె ఎలిమినేట్‌ కావడంతో అంతా కూడా ఆమె పట్ల జాలి చూపించారు. ఆమె కోరిక తీరిన తర్వాత ఎలిమినేట్‌ అయ్యి ఉంటే బాగుండేది అంటూ భావించారు. షాకింగ్‌గా ముమైత్‌ ఖాన్‌ మళ్లీ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసిన ముమైత్‌ ఖాన్‌కు ఈ వారం కెప్టెన్సీ దక్కింది. కెప్టెన్సీ టాస్క్‌లో ముమైత్‌ ఖాన్‌కు అంతా సపోర్ట్‌ చేశారు. మొదట దీక్ష మరియు అర్చనలు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. కాని హరితేజ, నవదీప్‌, ప్రిన్స్‌, శివబాలాజీ ఇలా అంతా కూడా ముమైత్‌ కోసం అంటూ వారిని ఒప్పించారు.

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ నడుముకు బెలూన్‌ కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ బెలూన్‌లను బిగ్‌బాస్‌ ఇచ్చిన నిడిల్‌తో పగులగొట్టాలి. అలా చివరకు ఎవరైతే మిగులుతారో వారే బిగ్‌బాస్‌ ఇంటి కెప్టెన్‌. ఆ టాస్క్‌లో మొదట హరితేజ తన బెలూన్‌ను స్వచ్చందంగా వదిలేసింది. ఆ తర్వాత శివబాలాజీ, ప్రిన్స్‌లు కూడా వదిలేశారు. కొద్ది సమయం దీక్ష మరియు అర్చనలు ఒకరి బెలూన్‌ ఒకరు పగులగొట్టేందుకు ప్రయత్నించుకున్నారు. దీక్ష బెలూన్‌ను అర్చన పగులగొట్టడంతో, అర్చన బెలూన్‌ను నవదీప్‌ పగులగొట్టడం జరిగింది. ఇక చివరికి నవదీప్‌ మరియు ముమైత్‌ ఖాన్‌లు మాత్రమే మిగిలిపోయారు. ప్రిన్స్‌ వెళ్లి నవదీప్‌ బెలూన్‌ను పగులగొట్టి ముమైత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు వచ్చేలా చేశాడు. హరితేజ తన కెప్టెన్సీ బాధ్యతలను ముమైత్‌ ఖాన్‌కు ఇచ్చేసింది. ఇక ముమైత్‌ ఖాన్‌ కెప్టెన్‌గా ఎలా అల్లాడిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు:

ప్ర‌భాస్ ఉండ‌గా…రీమేక్ ల‌తో ప‌నేముంది?

“మెంటల్ మదిలో ” ఏముందో ?