కాకినాడలో ప‌సుపు జెండా రెప‌రెప‌

TDP wins kakinada municipal corporation elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాకినాడ కార్పొరేష‌న్ఎ న్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. 30 ఏళ్ల త‌రువాత కాకినాడ పీఠంపై ప‌సుపు జెండా రెప‌రెప‌లాడింది. ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర‌ నుంచి టీడీపీ-బీజేపీ కూటమి స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌గా సాగింది.

నంద్యాల ఉపఎన్నిక త‌రువాత అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఉపఎన్నిక జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఈఎన్నిక రావ‌టంతో రాజ‌కీయ వేడి ఇక్క‌డా కొన‌సాగింది. టీడీపీ వైసీపీ హోరాహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండురోజులపాటు కాకినాడ‌లో రోడ్షో నిర్వ‌హించి టీడీపీ చేప‌డుతున్నఅభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 

పుష్క‌రకాలం త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో నంద్యాల‌లానే కాకినాడ ప్ర‌జ‌లు కూడా టీడీపీకే ప‌ట్టంక‌ట్టారు. నంద్యాల గెలుపుతో ఆత్మ‌విశ్వాసంలో ఉన్న‌ టీడీపీకి ఈగెలుపు మ‌రింత బలాన్నిచ్చిన‌ట్ట‌యింది. అటు వైసీపీకి మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది.

మరిన్ని వార్తలు:

నంద్యాలలో ఏమిటో ఈ మాయ..!

యోగి అసలు యాంగిల్ ఇదేనా..?

డీఎస్ గేమ్ వర్కవుట్ అవుతుందా..?