డీఎస్ గేమ్ వర్కవుట్ అవుతుందా..?

ts-d-srinivas-not-happy-with-the-cm-kcr-activities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డీఎస్ కు క్యాబినెట్ పదవి ఇచ్చి మరీ నెలకు లక్ష రూపాయలిస్తున్నారు కేసీఆర్. సలహాదారుగా గౌరవంగానే చూస్తున్నారు. కానీ క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరం చేశారని బాథపడుతున్నారు. ఈ మధ్య మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో కూడా తన పేరు అనవసరంగా బయటపెట్టారని డీఎస్ తెగ ఇదైపోతున్నారు. అందుకే తన కొడుకుని బీజేపీకి మద్దతుగా ఉసిగొల్పారని చెబుతున్నారు.

ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఢీకొని గెలిచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ధర్మపురి అరవింద్. అరవింద్ గెలుపు కోసం డీఎస్ కూడా వెనుక నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తారని కేసీఆర్ అనుమానిస్తున్నారు. అందుకే డీఎస్ ను కూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా.. అవి పెద్దగా వర్కవుట్ కావడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యేగా వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ.. అందుకోసం సరైన అభ్యర్థుల్ని వెతుకుతోంది. జనాన్ని కూడా ఢిల్లీ పీఠం పేరు చెప్పి ఎంపీలకు మద్దతిచ్చేలా కన్విన్స్ చేయొచ్చని బీజేపీ నమ్ముతోంది. ఈసారి కీలకమైన హైదరాబాద్ లోక్ సభ స్థానంపై కన్నేసిన బీజేపీ.. మరో ఐదు లోక్ సభ సీట్లు కూడా టార్గెట్ పెట్టుకుంది. అదే సమయంలో ఉన్న సికింద్రాబాద్ సీటు నిలబెట్టుకోవాలని చూస్తోంది. దీంతో డీఎస్ ను ఓ కంట కనిపెడుతున్నారట కేసీఆర్.

మరిన్ని వార్తలు:

విజయసాయికి మైండ్ పోయింది …పాలిటిక్స్ లోతు తెలిసొచ్చింది.

అవును..అత‌ను మా దేశంలోనే ఉన్నాడు

కోర్టు హాలు నుంచి త‌ప్పించుకునేందుకు ప‌న్నాగం…ఎర్ర‌బ్యాగుతో డేరా బాబా సంకేతాలు