ప్ర‌భాస్ ఉండ‌గా…రీమేక్ ల‌తో ప‌నేముంది?

murugadoss-planning-a-film-with-to-direct-prabhas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమాలు త‌మిళ రీమేక్ లుగా మార‌టం, క‌న్న‌డలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగులో పున‌ర్ నిర్మించ‌టం, బాలీవుడ్ బంప‌ర్ హిట్ ల‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయ‌టం, ఇక్క‌డ విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను బాలీవుడ్ దిగుమ‌తి చేసుకోవ‌టం ఎప్ప‌టినుంచో ఉన్న‌దే. ప్రాంతీయ భాష‌ల న‌టులకు, హిందీ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు లేక‌పోవ‌టం, బాలీవుడ్ హీరోల గురించి దక్షిణాది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా తెలియ‌క‌పోవ‌టం వంటి కార‌ణాల‌తో అన్నిచోట్లా ఈ రీమేక్ ల ప‌ర్వం న‌డుస్తుంటోంది. అందుకే కొంద‌రు డైరెక్ట‌ర్లు ఒక భాష‌లో తీసిన సినిమాను త‌ర్వాత మ‌రో భాష‌లో రీమేక్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి డైరెక్ట‌ర్లకు ప్ర‌భాస్ రూపంలో ప్ర‌త్యామ్నాయం దొరికింది.

బాహుబ‌లితో ప్ర‌భాస్ కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు ఆయ‌న రేంజ్ బాలీవుడ్ హీరోల‌తో స‌మానం. అందుకే ప్ర‌భాస్ తో ఒక‌సారి సినిమా చేస్తే ఇక మ‌ళ్లీ రీమేక్ లతో ప‌ని ఉండ‌దనుకుంటున్నారు ద‌ర్శ‌కులు. అందుకే బ‌డా బ‌డా ద‌ర్శ‌కులంద‌రూ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ డేట్స్ కో్సం ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ను డైరెక్ట్ చేసే అవ‌కాశం యువ ద‌ర్శ‌కుడు సుజీత్ కు ద‌క్కింది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో సాహోను తెర‌కెక్కిస్తున్నాడు సుజీత్‌. ప్ర‌భాస్ కున్న‌ జాతీయ‌స్థాయి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అదే త‌ర‌హాలో డైరెక్ట‌ర్ మురుగుదాస్ కూడా ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయాల‌ని భావిస్తున్నారు. త‌మిళ డైరెక్ట‌ర్ అయిన మురుగుదాస్‌… గ‌తంలో త‌న సినిమాల‌ను కొన్నింటిని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. గ‌జిని సినిమాను త‌మిళంలో సూర్య‌తో చేస్తే హిందీలో అమీర్ ఖాన్ ను హీరోగా తీసుకున్నారు.

సూర్య‌కు ఉత్త‌రాదిన గుర్తింపులేక‌పోవ‌టంతో హిందీ రీమేక్ లో అమీర్ ఖాన్ న‌టించాడు. మురుగ‌దాస్ సినిమాలు మ‌రికొన్ని కూడా ఇలానే రీమేక్ అయ్యాయి. అయితే ఇలా రీమేక్ ల‌తో ప‌నిలేకుండా ఒకేసారి జాతీయ‌స్థాయిలో విడుద‌ల‌య్యేలా ఓ సినిమా తీయాల‌ని మురుగదాస్ భావిస్తున్నారు. అందుకే దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు మురుగుదాస్ ప్లాన్ చేస్తున్నారు. సాహోతో పాటు మ‌రో చిత్రానికి ఇప్ప‌టికే ప్ర‌భాస్ అంగీక‌రించి ఉండ‌టంతో అవి పూర్త‌య్యే లోపు మంచి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు మురుగ‌దాస్‌. ప్ర‌భాస్ కు త‌గిన క‌థ‌ను సిద్ధం చేసి ఓకె చేయించుకోవాల‌ని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ ప్రివ్యూ .

కత్తి మహేష్‌ ఇష్యూ జాతీయ మీడియాలో..!

ఎన్టీఆర్‌ సినిమా.. బాలయ్య కొత్త ప్రకటన