ఇంకా కష్టపడుతూనే ఉన్న అనుష్క

Anushka Still Trying To Lose Weight

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ సినిమాలో దేవసేనగా నటించి భారీ క్రేజ్‌ను ముద్దుగుమ్మ అనుష్క దక్కించుకున్న విషయం తెల్సిందే. ‘బాహుబలి 2’ చిత్రంలో అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ అనే చిత్రంలో నటిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం అనుష్క ‘సైజ్‌ జీరో’ చిత్రంలో నటించింది. ప్రకాష్‌ కోవెల మూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా కోసం అనుష్క ఏకంగా 75 కేజీల బరువు పెరిగినట్లుగా సమాచారం. ఆ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. అప్పటి నుండి కూడా అనుష్క బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాజమౌళి ఎంత చెప్పినా, అనుష్క ఎంత ప్రయత్నించినా కూడా బరువు మాత్రం తగ్గలేక పోయింది.

‘సైజ్‌ జీరో’ సినిమా విడుదలవ్వడం, ఆ సినిమా గురించి అంతా మర్చి పోవడం జరిగింది. కాని ఇంకా ఆ సినిమా కోసం పెంచిన బాడీని అనుష్క తగ్గించే పనిలోనే ఉంది. ఇప్పటికి కూడా అనుష్క ఏకంగా 8 గంటల పాటు వర్కౌట్‌లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె సన్నిహితుల ద్వారా ఈ విషయం తెల్సిందే. వేగంగా లావు పెరిగిన అనుష్క చాలా స్లోగా బరువు తగ్గుతుంది. రోజుకు 8 గంటలు కష్టపడ్డా కూడా అనుష్క మాత్రం మెల్లగా బరువు తగ్గుతుందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. మునుపటి రూపంలోకి వచ్చిన తర్వాత అనుష్క కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వాలని నిర్ణయించుకుంది. త్వరలోనే అనుష్క ఇప్పటికే చేసిన ‘భాగమతి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని వార్తలు:

ఎట్టకేలకు ముగించిన సూపర్‌స్టార్‌

అర్జున్‌ రెడ్డికి వర్మ వింత సలహ