మహానుభావుడు మరో శతమానం అయ్యేనా?

Sharwanand Mahanubhavudu Release Date announced

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా శర్వానంద్‌ ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా చిరంజీవి మరియు బాలకృష్ణలకు పోటీగా వచ్చినా కూడా భారీ వసూళ్లను సాధించింది. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం. అంతటి విజయాన్ని దక్కించుకున్న శర్వానంద్‌ దసరాకు మరోసారి శతమానం వంటి సక్సెస్‌ను దక్కించుకోబోతున్నట్లుగా నమ్మకంతో చెబుతున్నాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహానుభావుడు’. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమా స్థాయిని పెంచింది. సినిమాలో మ్యాటర్‌ ఉందని, యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఆ సినిమాను ఆధరిస్తారనే నమ్మకంతో మారుతి ఉన్నాడు. తప్పకుండా శర్వానంద్‌కు మరో మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. అయితే దసరాకు మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్‌’ మరియు ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుశ’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.

ఈ రెండు చిత్రాలతో మహానుభావుడు పోటీ పడాల్సి ఉంది. ఇద్దరు స్టార్‌ హీరోలు, పైగా భారీ అంచనాలున్న ప్రతిష్టాత్మక చిత్రాల నడుమ రావడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి. శతమానంభవతి కూడా ఇలాగే వచ్చి సక్సెస్‌ అయ్యింది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి, పోటీని ఎదుర్కొని మరో శతమానం భవతిగా నిలుస్తుందనే నమ్మకం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది మరో శతమానం అవుతుందో లేదా ఫ్లాప్‌ అయిన రాధ చిత్రం అవుతుందో మరో రెండు వారాల్లో తేలిపోనుంది.

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ ప్రివ్యూ .

కత్తి మహేష్‌ ఇష్యూ జాతీయ మీడియాలో..!

ఎన్టీఆర్‌ సినిమా.. బాలయ్య కొత్త ప్రకటన

మహానుభావుడు మరో శతమానం అయ్యేనా? - Telugu Bullet