ద‌స‌రా బ‌రిలో శర్వానంద్

Sharwanand Acting On Villain Role In Dalapathi Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పెద్ద సినిమాల‌తో పోటీప‌డుతూనే మంచి విజ‌యాలు ద‌క్కించుకుంటున్నాడు శ‌ర్వానంద్‌. అగ్ర‌హీరోల సినిమాలు విడుద‌ల‌యిన సమయంలోనే రిలీజ‌యిన ఎక్స్ ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి శ‌ర్వానంద్ ఖాతాలో వ‌రుస హిట్లుగా నిలిచాయి. సెంటిమెంటో మ‌రేమో కానీ మరోసారి భారీ సినిమాల‌తోనే పోటీకి సిద్ద‌మ‌య్యాడు…ఈ క‌థానాయ‌కుడు. మారుతి డైరెక్ష‌న్ లో శ‌ర్వానంద్ న‌టిస్తున్న మ‌హానుభావుడు సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ద‌స‌రాకు ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ ద‌స‌రా బ‌రిలో నిలుస్తున్నాయి.

జై ల‌వ‌కుశ సెప్టెంబ‌రు 21న, స్పైడ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. వాటికి త‌గ్గ‌ట్టుగా అదిరిపోయే ఓపెనింగ్స్ ల‌భిస్తాయి. మ‌రి ఆ సినిమాల మ‌ధ్య మ‌హానుభావుడు ఎలా నిల‌దొక్కుకుంటాడో చూడాలి. పెద్ద సినిమాల‌తో పోటాపోటీగా విడుద‌ల‌యినా గ‌తంలోలానే శ‌ర్వానంద్ కు ఈ సారి ఘన విజ‌యం ద‌క్కుతుంద‌ని మ‌హానుభావుడు యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ నెల 24న రిలీజ్ చేయ‌నున్నారు. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబ‌రు 29న సినిమాను రిలీజ్ చేయాల‌ని యూవీ క్రియేష‌న్స్ భావిస్తోంది.

మరిన్ని వార్తలు:

పైసావ‌సూల్ లో బాల‌య్య న్యూలుక్