పైసావ‌సూల్ లో బాల‌య్య న్యూలుక్

balakrishna new look in paisa vasool movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]   

టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా ఉన్న మూవీ పైసా వ‌సూల్‌. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ  తొలిసారి పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై అటు బాల‌య్య అభిమానుల్లోనూ ఇటు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనూ భారీ అంచనాలు నెల‌కొన్నాయి. పూరీ హీరోల‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుంటారు. గ‌తంలో ఆయ‌న సినిమాల ద్వారా ఎంద‌రో హీరోల‌కు మాస్ ఇమేజ్ ద‌క్కింది. అయితే స్టార్ హీరో అయిన బాల‌య్య‌కు ఇప్పుడు కొత్త‌గా ఇమేజ్ రావ‌ల్సిన అవ‌స‌రం లేదు కానీ…పూరీ సినిమాలో ఆయ‌న  స్ట‌యిల్ ఎలా ఉటుందో అని అంద‌రూ  క్యూరియాసిటీతో ఉన్నారు.

పోస్ట‌ర్లు, ప్రోమో సాంగ్ లో బాల‌కృష్ణ మాస్ గెట‌ప్ తో ఉంటూనే క్లాస్ గా క‌నిపిస్తున్నారు. ఈ గెట‌ప్ కొంచెం నిప్పుర‌వ్వ‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాల్లో గెట‌ప్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు చూసిన బాల‌య్య వేరు… ఇప్పుడు బాల‌య్య వేరు అంటోంది చిత్ర యూనిట్‌. పైసావ‌సూల్ లో ఆయ‌న గెట‌ప్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక డైలాగుల విష‌యానికొస్తే… బాల‌కృష్ణ న‌టించిన ఎన్నో చిత్రాలు ఆయ‌న చెప్పిన డైలాగుల వల్లే బాక్సాఫీస్ హిట్లు సాధించాయి అంటే అతిశ‌యోక్తి కాదు. అటు పూరీ సినిమాల్లోనూ హీరో చెప్పే డైలాగ్ ల‌కు ఎంంతో ఫాలోయింగ్ ఉంటుంది. మ‌రి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా అంటే ఇక డైలాగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవ‌చ్చు. అందుకే పూరీ జ‌గ‌న్నాధ్  పైసా వసూల్ లో బాల‌య్య చెప్పే డైలాగుల‌కు ఒక సీడీ స‌రిపోదు అంటున్నారు.

బాల‌కృష్ణ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఎన్నో ఏళ్ల నుంచి  అనుకుంటున్నాన‌ని, ఇన్నాళ్ల‌కు ఆ క‌ల నెరవేరింద‌ని పూరీ అన్నారు. త‌న 101 వ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు బాల‌కృష్ణ‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.  బాల‌య్య‌ నుంచి అభిమానులు ఏమి కో్రుకుంటున్నారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉంటాయ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయ‌, ముస్కాన్ సేథీ, కైరా ద‌త్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సెప్టెంబరు ఒక‌టిన పైసావ‌సూల్  రిలీజ్ కానుంది.

మరిన్ని వార్తలు:

మెగా హీరోల ‘దాగుడు మూతలు’

పవన్‌25 గురించి ఫేక్‌ న్యూస్‌

రకుల్‌ భర్తకు అందం లేకున్నా అది ఉండాలట!