తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌టం సంతోషంగా ఉంది

Bollywood beauty Shraddha Kapoor latest comments on prabhas sahoo movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

ప్ర‌భాస్ సాహోలో హీరోయిన్ గా ఎంపిక‌యిన త‌రువాత బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్ తొలిసారి ఈ అవకాశంపై స్పందించింది. సాహో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని, ఆనందంతో ఉబ్బిత‌బ్బి్బ్బ‌వుతున్నాన‌ని శ్రద్ధాక‌పూర్ చెప్పింది. వారం రోజుల్లో ఆమె ప్ర‌భాస్ తో క‌లిసి రెగ్యుల‌ర్ షూటింగ్ లో పాల్గొంటుంది. పారితోష‌కమో, మ‌రో కార‌ణం చేతో సాహో అవ‌కాశంపై చివ‌రిదాకా ఎటూ తేల్చ‌ని శ్ర‌ద్ధా క‌పూర్‌.,.మొత్తానికి లేటుగా ఓకె చెప్పింది. అలానే ఈ అవ‌కాశంపై ఆమె సోష‌ల్ మీడియాలోనూ ఆల‌స్యంగానే స్పందించింది.

బాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన శ్ర‌ద్ధ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల గురించి, కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్టుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. కానీ సాహో విష‌యంలో ఎందుకో ఆమె స్పందించ‌లేదు. సినిమాకు సంతకం చేసిన త‌రువాత కూడా సోష‌ల్ మీడియాలో సాహో గురించి ఎక్కడా ప్ర‌స్తావించ‌లేదు. అయితే ఆమె స్పందించేలోగానే…ప్ర‌భాస్ అభిమానులు ఆమెకు గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతూ అనేక ర‌కాల పోస్టులు చేశారు.  ఈ పోస్టులు చూసి శ్ర‌ద్ధాక‌పూర్ కు ఎంతో సంతోష‌మేసింది. వారందరికీ థ్యాంక్స్ చెబుతూ సాహో సినిమా అవ‌కాశంపై త‌న ఆనందాన్ని పంచుకుంది.

శ్ర‌ద్ధ‌క‌పూర్ అయితే సాహోకు హిందీలో బిజినెస్ బాగా ఉంటుంద‌నే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఏరి కోరి ఆమెను ఎంపిక చేసింది. బాహుబ‌లి త‌ర్వాత జాతీయ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్ర‌భాస్ తో న‌టించేందుకు తెలుగులో స్టార్ హీరోయిన్ల‌తో పాటు అనేక‌మంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా పోటీప‌డ్డారు. అయితే చివ‌రికి శ్ర‌ద్ధాక‌పూర్ కు అవ‌కాశం ద‌క్కింది. గ‌తంలోనూ త‌నకు తెలుగు నుంచి అనేక ఆఫ‌ర్లు వ‌చ్చినా..కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమాలు చేయ‌లేక‌పోయాన‌ని శ్ర‌ద్ధాక‌పూర్ చెప్పింది. అటు తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఆమెకు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు  వెల్ కం చెప్పాడు. శ్ర‌ద్ధాక‌పూర్‌, టైగ‌ర్ ష్రాఫ్ జంట‌గా న‌టించిన హిందీ సినిమా భాగీలో సుధీర్ బాబు నెగ‌టివ్ రోల్ లో న‌టించాడు. ఆ ప‌రిచ‌యంతో సుధీర్ బాబు శ్ర‌ద్ధ కు టాలీవుడ్ లోకి స్వాగ‌తం ప‌లికాడు.

మరిన్ని వార్తలు: