సేఫ్‌ జోన్‌కు దగ్గర్లో బెల్లంకొండ మూవీ

jai-janaki-nayaka-hindi-satellite-rights-for10-crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్‌ హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ‘అల్లుడు శీను’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కారణంగా సక్సెస్‌ టాక్‌ వచ్చినా లాభాలు రాలేదు. ఇక రెండవ సినిమా ‘స్పీడున్నోడు’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యి నష్టాలను మిగిల్చింది. కాని మూడవ సినిమా అయిన ‘జయ జానకి నాయక’ చిత్రం నిర్మాతకు లాభాలను తెచ్చి పెట్టేట్లుగా కనిపిస్తుంది. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ చిత్రం మొదటి వారాంతంలో 15 కోట్ల వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ఈ చిత్రం 20 కోట్లు రాబడుతుందని, లాంగ్‌ రన్‌లో 25 నుండి 27 కోట్ల వరకు రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. 

వసూళ్ల ద్వారా 25 కోట్లుకు పైగా ఈ చిత్రం రాబట్టనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక శాటిలైట్‌ రైట్స్‌ను ప్రముఖ ఛానెల్‌ 5.5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇక హిందీ డబ్బింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఆన్‌లైన్‌ రైట్స్‌ ఏకంగా 10 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతుంది. ‘సరైనోడు’ చిత్రం హిందీలో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో హిందీ ఛానెల్‌ 10 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. అంటే మొత్తంగా 40 కోట్ల వరకు ఈ చిత్రం రాబట్టడం ఖాయం. ఈ లెక్కన చూస్తే నిర్మాతలకు అయిదు కోట్ల లాభం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

పవన్‌25 గురించి ఫేక్‌ న్యూస్‌

 

 

సేఫ్‌ జోన్‌కు దగ్గర్లో బెల్లంకొండ మూవీ - Telugu Bullet