పవన్‌25 గురించి ఫేక్‌ న్యూస్‌

Fake News about Pawan Kalyan and Trivikram Srinivas movie title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్‌25 చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని అందరి అంచనాలు అందుకునేలా, పవన్‌ కెరీర్‌లో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ తీర్చి దిద్దే పనిలో ఉన్నాడు. వచ్చే నెల 2న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. టైటిల్‌ ఇంకా ప్రకటించకుండానే గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చిత్ర టైటిల్‌ అంటూ ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్‌ తెగ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. 

ఇప్పటి వరకు పవన్‌25 చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదని, ప్రస్తుతం దర్శకుడి వద్ద అయిదు టైటిల్స్‌ ఉన్నాయి. వాటిల్లోంచి ఒక్కటి పవన్‌తో చర్చించి ఫైనల్‌ చేసే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. త్రివిక్రమ్‌ వద్ద ఉన్న అయిదు టైటిల్స్‌లో ‘రాజు వచ్చినాడు’ లేనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. టైటిల్‌ ఏంటో తెలియాలి అంటే సెప్టెంబర్‌ 2 వరకు ఎదురు చూడాల్సిందే. వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్‌లు రావడంతో పవన్‌ ఈ చిత్రంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. త్రివిక్రమ్‌కు పూర్తి ఫ్రీడమ్‌ ఇచ్చి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కీర్తి సురేష్‌, అను ఎమాన్యుల్‌లు ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు:

రకుల్‌ భర్తకు అందం లేకున్నా అది ఉండాలట!

అప్పుడే బడ్జెట్‌కు డబుల్‌ రాబట్టిన రానా

‘లై’ నష్టం ఎంతో తెలుసా?

పవన్‌25 గురించి ఫేక్‌ న్యూస్‌ - Telugu Bullet