జగన్ అకౌంట్స్ పనిలో జనసేన.

Janasena fan release ys jagan corruption details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  
నంద్యాల ఉపఎన్నికల బరిలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీ రాజకీయ వైఖరి భవిష్యత్ లో ఎలా వుండబోతోంది అన్న చర్చ మొదలైంది. అయితే జనసేన అభిమానులు ఏమనుకుంటున్నారు అన్న అంశం మీద ఆ పార్టీ అధిష్టానం ప్రధానంగా దృష్టి సారించింది.

ఈ పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకి చెందిన ఓ జనసేన కార్యకర్త ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కి రాజకీయ దూరం పాటించాలని సూచించాడు . అందులో భాగంగా వై.ఎస్, జగన్ హయాంలో జరిగిన ఒకటిరెండు కాదు ఏకంగా 200 తప్పుల్ని ఎత్తి చూపించాడు. ఇప్పుడు ఆ లేఖ, జగన్ చేసిన 200 తప్పుల అకౌంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో ఉరుకులుపరుగులు తీస్తోంది. ఆ లేఖ ప్రతి మీ కోసం. ..

1. ఒకప్పుడు అప్పుల్లో ఉన్న నీ కుటుంబం, అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మడానికి అప్పటి సి.ఎం కు లేఖ రాసిన నీ కుటుంబం, ఇప్పుడు దేశం లోనే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించే విధం గా ఎలా ఎదిగింది? ఆ కిటుకు చెపితే ప్రజలు కూడా నిన్నే అనుసరిస్తారు, అప్పుడు సంక్షేమ పధకాలు కూడా అవసరం లేదు, నీ లాగా శాశ్వత అభివృద్ధి కావాలి. ఇంత తెలివి ఉంటే నిన్ను బిజినెస్ స్కూల్స్ లో పాఠాలు చెప్పడానికి పిలవరెందుకు?

2. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే నువ్వు, నీ పైన ఉన్న అక్రమాస్తుల కేసులో 10 సిబిఐ ఛార్జ్ షీట్స్ గురించి విపులం గా గురించి ప్రజలకు వివరించ గలవా? సిబిఐ కేసులలో చార్జ్ షీట్స్ ఉన్న వారికి (నీ తో సహా) సీట్లేందుకు ఇస్తున్నావు? నీ పార్టీ కి అవినీతి మీద ఒక విధానం అంటూ ఉందా?

3. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చాల్సిన అధికారంతో వ్యవస్థలను ధ్వంసం చేసి – ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ముఖ్యమంత్రి పీఠాన్నీ తనయుడి ఆర్థిక అవసరాలు తీర్చే అక్షయ పాత్రగా వైఎస్‌ మార్చేశారని విజిలెన్స్‌ కమిషనర్‌గా పని చేసిన ఐఏఎస్‌ అధికారి రామచంద్ర సమాల్‌ 2007లో వెల్లడించారు. వీటిని ఖండించే ధైర్యం ఉందా?

4. రాజన్న పాలన తెస్తామంటున్నారు. వేళ్లూనుకున్న అవినీతి వూడలు రాష్ట్రం ఎల్లలు దాటి ఖండాంతరాలు వ్యాపించడమేనా రాజన్న పాలన అంటే? సీబీఐ నుంచి ఎఫ్‌బీఐ స్థాయి వరకు మీపై కేసులున్న మాట వాస్తవం కాదా?

5. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి 10 రూపాయల షేరు 350కు, 1440కి అమ్ముకోలేదా? సొంత కంపెనీ మదింపు విలువ అనేక రెట్లు ఎక్కువ చేసి 3వేల కోట్ల రూపాయలుగా చూపించి మోసం చేయలేదా?

6. హైదరాబాద్ లోని అవినీతి సొమ్ముతో బెంగళూరు లో 4000 ఎకరాలు కొన్నది నిజం కాదా? ఇప్పటికీ బెంగళూరు లో పెద్ద భూస్వాములు మీ కుటుంబమే కదా!

7. బెంగళూరు యెలహంక లో 35 ఎకరాల రూ 500 కోట్ల పాలస్, బెంగుళూరు హెచ్.ఎస్. ఆర్ లేఔట్ లో బినామీ పేర్లతో వేల కోట్లు విలువ చేసే వందల కొద్దీ బినామీ ఇళ్లు, నగరం నడిబొడ్డున మంత్రి మాల్, అరికేరే లో వందల ఎకరాలు భూములు, గేటెడ్ టౌన్ షిప్స్ ఎలా వచ్చాయో చెప్పగలవా? ఇవన్నీ కూడా కడప లోని సామాన్య ప్రజల పేరుతోనే బినామీలుగా కొన్నావు కదా?

8. ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించేశాక – ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా?

9. అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది వైఎస్‌. కాదనగలరా? ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలగలేదా?

10. వైఎస్‌ ముఖ్యమంత్రి కాకముందు కర్ణాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్‌ హ్యాండ్‌ విద్యుత్‌ ప్లాంటు నడుపుకొంటున్న మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?

11. నువ్వు, నీ నాయన జెరూసలెం వెళ్ళేది దైవ దర్సనానికా లేక దొంగ లెక్కలు సరిచూడడానికా? మాకు తెలియదు అనుకున్నావా? లండన్, సైప్రస్, మారిషస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, లక్సంబుర్గ్ నుండే కదా నీ నల్ల డబ్బు అంతా నీ కంపెనీలలో విదేశీ పెట్టుబడుల రూపం లో వచ్చేది. ఇదే కదా సిబిఐ, ఈడి, ఆదాయ పన్ను శాఖ లు చెప్పింది! ఇప్పటికే సిబిఐ ఆయా దేశాలకు మరింత సమాచారం కోసం లేఖలు పంపడం నిజం కాదా.

12. కృష్ణ పట్నం పోర్ట్, గంగ వరం పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, మచిలీ పట్నం పోర్ట్ లో నీ వాటా ఎంత? వాళ్ళంతా నీ బినామీ లే కదా? నువ్వు – కెవిపి – వైఎస్ నిర్మించిన అవినీతి పునాదులే కదా ఇవి, ఈ పోర్ట్ లను ఉపయోగించే కదా నీ చెంచాలు ఐన బళ్ళారి రెడ్డి బ్రదర్స్ దొంగ రవాణా, అక్రమ రవాణా చేసేది. సి.బి.ఐ కూడా ఇదే చెప్పింది కదా.

13. మన రాష్ట్రం లో గ్రూప్ 1 టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితం ను అవినీతిలో ముంచి సర్వ నాశనం చేసింది నువ్వు కాదా? జైలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంది. నీ అక్రమాస్తుల కేసులో ఐఎఎస్. రత్న ప్రభ నిన్ను కోర్ట్ ఆవరణలో పట్టుకొని తిట్టడం నిజం కాదా?

14. నీ నాయన, నీ అక్రమాస్తుల కేసుల మూలంగా 108 మంది పారిశ్రామిక వేత్తలు, అధికారులు అవినీతి కేసులు ఎదుర్కోవడం నిజం కాదా? వీరేవ్వరికీ బెయిల్ రాకుండా నీ ఒక్కరికే బెయిల్ ఎలా వచ్చింది? ఈ బెయిల్ డీల్ కోసమే కదా రాష్ట్ర విభజన జరిగింది? వారిని ఎప్పుడైనా ఓదార్చావా?

15. నీవు కూడబెట్టిన వేల కోట్లు, బడుగు బలహీన వర్గాలు, వృద్ధులు, మహిళలు, విద్యార్ధులవే కదా? నేవ్వొచ్చి వీళ్ళకి సంక్షేమ పధకాలు ఇస్తావా? నిన్ను నమ్మాలా? సి.ఎం కొడుకు గానే అంత దోచిన వాడివి, సి.ఎం అయితే ఇంకెంత దోచుకు తింటావో అని కోస్తా ప్రజలు, సీమ ప్రజలు భయపడుతున్నారు! ఇది నీకు తెలియదా?
16. ఇలా ఎడాపెడా సంతకాలు పెట్టె కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నీ కుటుంబం? ఇంకేమి సంతకాలు మిగిలాయి? మీ నాన్న సంతకానికి 10 కోట్లు తీసుకొనేవాడు కదా! ఇది మర్చిపోయావా?

17. మౌలిక సదుపాయాల కంపెనీలు అయిన మెయిల్, ఇందు ప్రాజెక్ట్స్, ఐ.వి.ఆర్.సి.ఎల్, కె.ఎం.సి, నవయుగ, రాంకీ లాంటివి అన్నీ నీ బినామీలే కదా? వీటిలో డబ్బే నీ కంపెనీలలో, నీ జేబులోకి పోయేది! ఇవన్నీ కూడా ఈ రోజు సిబిఐ కేసులలో ఉన్నాయి కదా?

18. ఎన్.డి.టి.వి కి సంవత్సరానికి 30 కోట్లు ఇచ్చి నీ మీద దొంగ సర్వే లు చేయించు కొంటున్నావు కదా? జాతీయ మీడియా లో నీ మీద భజన చేయించుకుంటూన్నావు కదా? నీ సాక్షి కి – ఎన్.డి.టి.వి కి మధ్య జరిగిన డీల్ బయటపెట్టే దమ్ముందా?

19. నీకు – ఇండియా టుడే గ్రూప్ కి ఎంతకీ ఒప్పందం కుదిరింది, భజన చేయించుకోవడానికి? వీళ్ళు, సి-వాటర్ సహకారం తో చేసే సర్వే లు దొంగ సర్వేలు అని బయట పడింది కదా?

20. హైదరాబాద్ లో నీరజా రావు భూమిని ఆక్రమించాలని చూసి కోర్ట్ లో మొట్టి కాయలు వేయించుకున్నావు కదా? మరిచితివా? నీరజా రావు విమర్శలకు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేక పోయావు కదా? ఆవిడ మాట్లాడితేనే నీ గుండెల్లో దడ కదా!

21. సిబిఐ కేసులలో భాగం గా వాళ్ళు నిన్ను ప్రశ్నించిన 5000 ప్రశ్నలను ప్రజలకు చెప్పా గలవా? నీ దొంగ సాక్షి లో ప్రచురించగలవా? అంత దమ్ము, దైర్యం ఉన్నాయా?

22. పైసా కూడా నీ సొంత పెట్టు బడి లేకుండా భారతి సిమెంట్స్ పెట్టి, సున్నపు రాయి, నీరు, భూమి, ఋణం అన్నీ కూడా ప్రభుత్వం నుండి తీసుకొని, చివరికి ఆ కంపెనీని 6000 కోట్ల కు అమ్మడం నిజం కాదా? అది ఎవడబ్బ సొమ్ము? ఇందులో ప్రభుత్వానికి ఎంత ఇచ్చావు?

23. అవినీతి కేసులలో జైలు లో ఉండి నువ్వా విలువలు గురించి మాట్లాడేది? జైలు లో కూడా నువ్వు వెలగపెట్టిన బాగోతాలు మాకు తెలియవు అనుకుంటున్నావా?

24. కొండా దంపతులు వాళ్ళ 200 కోట్ల అవినీతి సొమ్ముని నీ దగ్గర పెడితే, తరువాత లేదు పొమ్మన్నావు కదా? అందుకే కదా వాళ్ళు నీ పార్టీ లో చేరింది, తరువాత వీడింది? ఇదేనా విశ్వసనీయత?

25. 2009 ఎన్నికల ముందు ఉరుకులు పరుగులతో హడావుడిగా మార్చి 2న రికార్డు స్థాయిలో 389 జీవోలు జారీ చేసి మూటలు కట్టుకున్నది నిజం కాదా? ఆ హడావిడి జీవోల వెనక ఉన్న మతలబులేమిటి?

26. నీ అవినీతి సొమ్ముతో 50000 కోట్ల పవర్ ప్రాజెక్ట్స్ – 10000 మెగా వాట్స్ ను ఆంధ్ర తో సహా వివిధ రాష్ట్రాలలో మొదలు పెట్ట లేదా? ఇంత డబ్బు నీకేక్కడిది? ఈ కరెంటు ను ఆంధ్ర లో రైతులకు ఉచితం గా ఇవ్వ గలవా?

27. మొన్నటి దాకా ఎం.బి.ఎ అని చెప్పుకు తిరిగి 2011 లో నువ్వు చేసింది బికాం మాత్రమే అని చెప్ప లేదా? నీ కంపెనీ అఫిడవిట్ లో ఎం.బి.ఎ అని 2012 ఎన్నికలలో బికాం అని చెప్పడమేనా నీ విశ్వసనీయత?

28. నీ సాక్షి పత్రిక లో పెట్టుబడులు అన్నీ అక్రమ పద్దతుల్లోనే వచ్చినవి కాదా? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా? అందుకే కోర్ట్ బోను ఎక్కావు కదా?

29. నరసారావుపేట టికెట్ ను అయోధ్య రామి రెడ్డి కి 100 కోట్ల కు అమ్ముకోలేదా? ఈ డబ్బు చెల్లించడానికి అతను విశాఖ, హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీ ని అమ్మకానికి పెట్టడం నిజం కాదా?

30. ఎం.పి టికెట్స్ ఇస్తానని చెప్పి పివిపి, రఘు రామ కృష్ణమ రాజు చేత కోట్లు ఖర్చు పెట్టించడం నిజం కాదా?

31. ఎం.పి సీటు కి 50 కోట్లు, ఎంఎల్ఎ సీటు కి 20 కోట్లు రేట్ ఎందుకు పెట్టావు? ఇంకా ఆశ తీరలేదా? వీటి అమ్మకాల ద్వారా నువ్వు సంపాదించినదే 5000 కోట్లు వుంటుంది కదా! ఇంకెంత కావాలి?

32. నీవు జైలు లో వున్నప్పుడు టికెట్స్ అమ్ముకొని నీకు వాటా ఇవ్వనందుకే కదా, నీ బాబాయి వైవి. సుబ్బా రెడ్డి ని దూరం పెట్టావు?

33. లక్షన్నర కోట్ల విలువైన బయ్యారం గనులు, నీ బావ కు చెందినా రక్షణ స్టీల్స్ కు నీ కుటుంబం ఆడపడుచు కట్నం గా ఇవ్వడం నిజం కాదా? గిరిజనులను బినామీ గా పెట్టుకొని మీరే దోచుకు తింటున్నారు కదా!

34. అనంతపురం లో ఓబులాపురం మైన్స్ లో 10,000 కోట్ల వరకు దోచుకుంటే, ఆ కేసులో గాలి జైలు లో వున్నాడు కదా? అందులో నీ వాటా 50% అనేది జగమెరిగిన సత్యం కదా? రెండు కంపెనీల డైరెక్టర్ లు (సజ్జల బ్రదర్స్) సాక్షి పత్రికలో డైరెక్టర్ లే కదా. ఇంతకన్నా రుజువులు కావాలా నువ్వెంత గజ దొంగ వో చెప్పడానికి.

35. ఆరు లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని గాలి సోదరులు తరలించుకుపోయేలా వ్యూహ రచన చేయడమే కాదు… జాతి సొత్తును కొందరు వ్యక్తులకు కట్టబెట్టేలా చేసింది మీరు కాదా?

36. 2007-10ల మధ్య 5194.33 కోట్ల రూపాయల ఖనిజాన్ని గాలి సోదరులకు అడ్డగోలుగా అప్పగించిన మీరే – ఉక్కు కర్మాగారం ఏర్పాటుని ప్రతిపాదించి పదివేల ఎకరాల స్థలాన్ని, కడపలో విమానాశ్రయం పేరిట మరో 4వేల ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టారు. నిబంధనలు కాలరాసి రెండు శత కోటి ఘనపుటడుగుల కృష్ణా నీటిని తరలించేందుకు తీర్మానించింది వైఎస్‌ కాదా?

37. కబ్జా చేసిన అటవీ భూముల్లో లక్షా 95వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని గాలి సోదరులు కొల్లగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారా లేదా?

38. ఇప్పుడు నువ్వు ఉంటున్న లోటస్ పాండ్ బిల్డింగ్ ఖరీదు 700 కోట్లు కాదా? ఇంత డబ్బు నీకేక్కడిది? కంపెనీలు ఎక్కడైనా ఇల్లు కడతాయా? నీ సంపాదనే అయితే ఈ ఇంటిని కంపెనీల పేరుతో ఎందుకు చూపిస్తున్నావు? ఇవే కంపెనీల నుండి కారు చౌక గా కొట్టే సి, నీ నల్ల డబ్బు ని తెల్ల డబ్బు గా మార్చు కుందామనే కదా!

39. 60% ఆదాయం అందిస్తూ, ప్రభుత్వానికి వేల కోట్లు పన్నులను ఇస్తున్న, ఆంధ్ర రాష్ట్రం అవసరాలను తీరుస్తున్న ఖనిజ సంపదను పక్క రాష్ట్రాలకు, గాలి జనార్ధన రెడ్డి లాంటి అవినీతి పరులకు తరలించింది ఎవరు..? నువ్వు నీ నాయన కాదా?

40. 2004 Y.S రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన తన కుమారుడి ఆస్తుల విలువ 8.19 లక్షలు, 2009లో Y.S రాజశేఖర్ రెడ్డి డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 1.32 కోట్లు, 2009లో ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన జగన్ మరియు అతని భార్య ఆస్తుల విలువ 77.40 కోట్లు…2011 బై ఎలక్షన్ నాటికి ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 410 కోట్లు…( Y.S.జగన్ ఆస్తుల విలువ 365 కోట్లు మరియు తన భార్య పేరుతో 47.25 కోట్లు(నగలతో కలిపి)ప్రకటించాడు.) 2011 బై ఎలక్షన్ నాటికి బెంగుళూరు ఎలహంక లో వున్న ఇల్లును,హైదరాబాద్ లోటస్ పాండ్ లో వున్న ఇంటిని లెక్కలో చూపించలేదు. ఇదంతా ఎలా సంపాదించావు? కనీసం నీ భార్య, పిల్లలకు అయినా తెలుసా?

41. సాక్షి మరియు మని లాండరింగ్ ద్వారా జగన్ అక్రమంగా సంపాదించిన 890కోట్ల ఆస్తులను ఈడి జప్తు చేసింది .ఇంకా 7 చార్జీ షీట్లలో 2000కోట్లు అటాచ్ చేయబోతుంది. దీని మీద సమాధానం చెప్పగలవా?

42. నీ సాక్షి పత్రిక జిల్లా ఆఫీసులు/స్థలాలు అన్నీ కూడా ముందుగా కాకినాడ ఎం.ఎల్.ఎ చంద్రశేకర రెడ్డి చేత కొనిపించి, అక్కడనుండి నువ్వు నీ జనని ఇన్ఫ్రా ద్వారా చౌక గా కొట్టేయ్యలేదా? ఎందుకు ఇంత దాపరికం? ఇదంతా అవినీతి సొమ్మే కదా? నీ జనని ఇన్ఫ్రా లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరిదీ ఇదే కధ కాదా?

43. కలకత్తా లోని 30 అల్లి బిల్లి కంపెనీల ద్వారా కొన్ని వందల కోట్లు నీ కంపెనీలోకి ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? దేశం లో అన్ని దర్యాప్తు సంస్థలు నిన్నే దోషి గా తేల్చాయి కదా! దీని గురించి ప్రజలకు వివరించగాలవా? అదంతా నీ నల్ల డబ్బే కదా? నీ నాయన సంతకాలు చెయ్యగా వచ్చిందే కదా?

44. 10 కేసులలోనే నీ అవినీతి లెక్క 43 వేల కోట్లు గా సిబిఐ తేల్చింది కదా? ఎప్పుడైనా ప్రజలకు సమాధానం చెప్పావా? పోనీ నీ పత్రిక కి అయినా, లేక నీ భార్య కి అయినా?

45. ఆంధ్ర రాష్ట్ర ఖజానా ను అప్పనం గా కొల్లగొట్టిన నీ కుటుంబాన్ని అఖిల ఆంధ్ర ప్రజలు దొంగల ముఠా అనడం నిజం కాదా?

46. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఒకరు, 12 కోట్ల వరకు ముడుపులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ టికెట్ ఆశించిన మరో ప్రముఖుడు 72 కోట్ల వరకు బేరం కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. విజయవాడ నుంచి ఎంపీ అయిపోదామనుకున్న ఒకరు ఇప్పటికే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీలో పరిస్థితులు నచ్చక పోవడంతో మిడిల్ డ్రాప్ అయిపోయారు. సింగపూర్‌లో ఏదో వ్యాపారం చేసి వంద కోట్ల వరకు సంపాదించిన ఒకరు, ఒంగోలు లోక్‌సభ టికెట్ ఇస్తే 25 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. వీటి లో ఎన్ని నిజాలు ? అసలు మొత్తం వసూలు ఎంత?

47. విశాఖపట్టణం నుంచి ఎలాగైనా ఎంపీగా ఎన్నిక కావాలని పట్టుదలతో ఉన్న తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిని 91 కోట్ల వరకు డిమాండ్ చేసిన విషయం నిజం కాదా?

48. మచిలీపట్నం లోక్‌సభ సీటు ఆశించి 12 కోట్ల వరకు సమర్పించుకున్న తనకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించకపోవడంతో ఆందోళన చెందిన కుక్కల నాగేశ్వరరావు, ఆ బాధతోనే ఇటీవల గుండెపోటుకు గురై మరణించారన్నది నిజం కాదా? చివరికి ఆయన కొడుకికి కూడా చేయ్యివడం నిజమే కదా!

49. దాడి వీరభద్రరావు, రత్నాకర్‌, తమ్మినేని సీతారాంకు,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,భూమా దంపతులు ,షర్మిల, వైవీ సుబ్బారెడ్డి,కొండా దంపతులు యావత్ తెలంగాణా నాయకులు ఇలా జగన్ ని నమ్ముకున్న వారి ‘బాధితుల’ జాబితా అంతకంతకూ పెరుగుతోంది. జగన్ ని నమ్మితే చివరికి జనాలని కూడా అమ్మేస్తాడు అనేది నిజమే కదా!

50. నీ నాయన పాలన పై, ప్రతి శాఖ పై, ప్రతి నిర్ణయం పై, సంతకం పై, నీ ఆస్తుల పై, నీ బినామీ ల పై, నీ బంధువుల పై సిబిఐ దర్యాప్తు నకు సిద్దమేనా?

51. మీ నాయన అవినీతి సొమ్ము లో 10 వేల కోట్లు కెవిపి దగ్గర దాచాడు, నీ నాయన చావు తరువాత వీటి గురించే కదా నీకు కెవిపి కి గొడవలు వచ్చాయి, మాకు తెలియవు అనుకుంటున్నావా?

52. హైదరాబాద్, ఆంధ్ర లో ఉన్న 50 సెజ్ లు నీ బినామీలవే కదా, దీని పై సిబిఐ దర్యాప్తు నకు సిద్దమేనా? కాగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్పింది కదా. వీటి మీద చర్చించే దమ్ముందా!

53. సత్యం రామలింగ రాజు పతనానికి కారణం నీ యొక్క కమీషన్ ల డబ్బు ఒత్తిడే కదా! ఈ సత్యం మొత్తం కదా చెపితే వినే దైర్యం ఉందా నీ కుటుంబానికి?

54. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ తెరపైకి తెచ్చి ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి 9 నెలలోనే 8,444 ఎకరాల భూమిని కట్టబెట్టారు. 10వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్న ఆ సంస-్థ 4650 ఎకరాలను తాకట్టు పెట్టి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఐడిబీఐ, కెనరా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకుల నుంచి 830 కోట్లు రుణం పొందినట్లు 9వ చార్జిషీటులో సీబీఐ చూపించింది వాస్తవమా కాదా?

55. ఇందు – శ్యాం ప్రసాద్ రెడ్డి దివాలా తీయడానికి నీ స్కాం లే కదా ప్రధాన కారణం. ఇందు ప్రాజెక్ట్ ను అమ్మగా వచ్చిన డబ్బు – 400 కోట్లు , లేపాక్షి హబ్ ను తాకట్టు పెట్టిన డబ్బు – 800 కోట్లు అంతా నువ్వే కదా లాక్కున్నావు.

56. నువ్వు నీ స్వార్ధం కోసం మమ్మల్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతావా….ఎంత నిజాయితీగా బ్రతికి న వాళ్ళం…ఇప్పుడు నీ మూలాన కోర్టులు చుట్టూ తిరుగుతున్నాం…! అని సిబిఐ కోర్టులో నిన్ను కడిగి పారేసింది కదా ఐఎఎస్ రత్న ప్రభ…! నీది కూడా ఒక బ్రతుకేనా?

57. వైఎస్ వున్నప్పుడు మీ అక్రమాలను కప్పిపుచ్చ దానికి సాయి రెడ్డి ని ఆర్.బి.ఐ డైరెక్టర్ గా చెయ్యమని మీ నాయన సిఫార్సు లేఖ ఎందుకు రాశాడు. నీ ఆర్ధిక అక్రమాలను కప్పి పెట్టడానికే కదా. దీన్ని గురించి ఏమి చెబుతావు.

58. వివిధ జాతీయ బ్యాంకు లలో సాయి రెడ్డి ని డైరెక్టర్ గా నియమించడానికి నీ తండ్రి సిఫార్సు లేఖ ఎందుకు రాశాడు, ఆ బ్యాంక్స్ నుండి వీలైనంత సొమ్మును ఆంధ్ర లో ప్రభుత్వ భూములు ను కంపెనీల ద్వారా దోచడానికే కదా?

59. కేంద్రం చేతిలో పావుగా సిబిఐ మారింది అని విమర్శించే వాడివి, సిబిఐ కి స్వయం ప్రతిపత్తి గురించి ఎందుకు మాట్లాడవు, నీ రంగు మరింత బయట పడుతుందనేనా!

60. నీ సరస్వతి పవర్ కు గుంటూరు లో 1500 ఎకరాల సున్నపురాయి (రూ 1.5 లక్షల కోట్లు) లీజు ఎలా వచ్చింది? నువ్వు ముఖ్య మంత్రి కొడుకువి అనే కదా? నీ కన్నా ముందే అప్లై చేసిన వాళ్ళకు ఎందుకు రాలేదు?

61. వైఎస్ అవినీతి నిర్ణయాలలో మంత్రుల ది కూడా భాగ స్వామ్యం వుంది అని కోర్ట్ కి వెళ్లి, ఆ మంత్రులనే నీ పార్టీ లోకి చేర్చుకొని టికెట్స్ ఇవ్వడం అంటే నీ నాయన అవినీతి ని ఒప్పుకున్నట్టే కదా?

62. నీ చెల్లెమ్మ కి 11 కంపెనీలు ఉన్నాయి, 6 కంపెనీలలో డైరెక్టర్ గా ఉండి, ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయి చెప్పగలవా? సగం రాష్ట్రాన్ని నీ చెల్లి కి ఆడపడుచు కట్నం గా ఇవ్వడానికి నీ కేమి హక్కు వుంది?

63. నీ బావకి అన్ని కంపెనీలు, ఖరీదైన ఫ్లైట్స్, వేల కోట్ల ఆస్తులు గత పదేళ్ల లో ఎలా వచ్చాయి, ఆగస్టా హెలికాప్టర్ ల కుంభకోణం నీ బావ చలవే కదా.

64. వైఎస్ పాలనలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సెజ్‌ ల కోసం దాదాపు లక్ష ఎకరాలను పంచిపెట్టారు, ఇదే మన్న నీ తాత ముల్లా?

65. నీకు, నీ మిత్రుడు గాలి కంపెనీల కు కోల్ కత్తా లోని అల్లి బిల్లి కంపెనీల నుండి నిధులు హవాలా మార్గం లో రావడం నిజమే కదా? దీనికి సమాధానమేమీ? ఈడి కూడా ఇదే నిర్ధారించింది కదా!

66. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డు పెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేల కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టుకుంది నిజం కాదా?

67. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు లో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా మీ పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధి పొందారు, నీకెంత వాటా దక్కింది దీనిలో?

68. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం ముషీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు, వాళ్ళంతా నీ బినామీ లే కదా.

69. భూముల కేటాయింపులు జరిగిన తేదీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తేదీలను చూస్తే వాటిని పెట్టుబడులు అని కాకుండా లంచాలు అని నిర్దారించవచ్చు. పెట్టుబడుల రూపంలో చెల్లించి నవన్నీ లంచాలే”- అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది, దేనికి ఏమంటావ్?

70. తన కుమారుడు జగన్మోహనరెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా అన్ని నిబంధనలనూ తుంగ లో తొక్కి వైఎస్ ప్రభుత్వం అరబిందో ఫార్మా, హెటేరో గ్రూప్ కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూర్చిందని జగన్ అక్రమాస్తుల కేసులో తొలి జప్తుపై ఇచ్చిన తీర్పులో న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. దేనికి ఏమంటావ్?

71. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలను నాశనం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా?

72. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ టీడీపీ హయాంలో బిల్ క్లింటన్ పక్కన కూర్చొంటే వైఎస్ హయాంలో జైల్లో కూర్చొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కోర్టు, జైలు, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

73. మీ నాన్నలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే బంగారు కుర్చీ, బంగారు పళ్ళాలు గాలి జనార్దనరెడ్డికి వచ్చేవా..?

74. జగన్ అమాయకుడు అయితే 16 నెలలు బంధించాల్సిన చట్టాలు ఉంటాయా..? దీనిపై చర్చకి సిద్దమా?

75. వైజాగ్ లో రాంకీ ఫార్మా సిటీ వ్యవహారం లో 914 ఎకరాలు అక్రమం గా అమ్ముకొని 130 కోట్లు లాభం పొందారు, వీటి అసలు విలువ ఇప్పుడు 5000 కోట్లకు ఫైనే కదా! ఈ డబ్బు ను సాక్షి లో పెట్టుబడి పెట్టారని సిబిఐ తేల్చింది. దీనికి సమాధానమేమీ?

76. రాంకీ గ్రీన్‌ బెల్ట్‌ ఏరియాను 250 మీటర్ల నుంచి 50 మీటర్లు తగ్గించి ఆ సంస్థకు 914 ఎకరాలు ప్రయోజనం చేకూర్చారు. వీళ్లే జగతిలో 10 రూపాయలు విలువైన ఒక్కో షేరును రాంకీకి చెందిన ఇఆర్‌ఇఎస్‌టీడబ్ల్యు సంస్థ కొనుగోలు చేయడం ద్వారా 9.99 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తేల్చింది. ఇందులో నిజం లేదా?

77. పరవాడలో రాంకీ సంస్థ ఏర్పాటు చేసిన ఫార్మాసిటీకి రిజిస్ట్రేషన్‌ ఫీజు స్టాంపు డ్యూటీ కింద ఖర్చు అయిన 3.10 కోట్లను వెనక్కి చెల్లించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది వైఎస్‌ కాదా?

78. జీవో నెం.54 ద్వారా కడప జిల్లాలో 1562 ఎకరాలు భారతీ సిమెంట్స్‌ 30ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన మాట నిజమే కదా? ఈ సంస్థలో దాల్మియా సిమెంట్‌ రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ నిర్ధారించడం వాస్తవమే కదా?

79. జీవో నెం.305 ద్వారా కడపలో 2037 ఎకరాలు లైమ్‌స్టోన్‌ భూములను రఘురాం సిమెంట్స్‌కు ధారాదత్తం చేసింది వైఎస్‌ కాదా?

80. 2005లో రఘురామ్‌ సిమెంట్‌ను జగన్‌ దక్కించుకుని తరవాత 2006లో భారతీ సిమెంట్‌గా పేరు మార్చి కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో 2037.52 ఎకరాల సున్నపు గనులను కేటాయింపజేసుకొన్నట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇది వాస్తవం కాదా?

81. జీవో నెం.25 ఆధారంగా – పెన్నా సిమెంట్‌కు తాండూరులో 822 ఎకరాలు లైమ్‌స్టోన్‌ క్వారీలను కేటాయిస్తూ జీవో నెం.76 జారీ చేసింది వైఎస్‌ కాదా?

82. జీవో నెం,1490 ద్వారా అనంతపురం జిల్లాలో 231.91 ఎకరాల భూమిని పెన్నా సిమెంట్స్‌కి బదలాయించిది వైఎస్‌ కాదా?

83. జీవో నెం.865 కడపలోని ఇండియా సిమెంట్స్‌కి 60 ఎకరాల భూమి లీజు పొడిగించి ఇండియా సిమెంట్స్‌కు రోజుకు పది లక్షల గ్యాలన్ల నీరు కేటాయించింది వైఎస్‌ కాదా?

84. జీవో నెం.1110 ద్వారా ప్రకాశం జిల్లాలోని 6406 ఎకరాల భూమిని వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు కేటాయించింది వైఎస్‌ కాదా? జీవో నెం.1115 ద్వారా వాన్‌పిక్‌ కోసం గుంటూరు జిల్లాలో 5451 ఎకరాల భూమిని బదలాయించిది వైఎస్‌ కాదా?

85. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు పైగా భూములు కేటాయించినందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో 854.50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని సీబీఐ నిగ్గు తేల్చింది. ఇది వాస్తవం కాదా?

86. అక్రమ లావాదేవీలున్న కంపెనీలతోపాటు 12 బ్రీఫ్‌కేస్‌ కంపెనీలపైనా, విదేశాల నుంచి మీ సంస్థల్లోకి వచ్చిన సొమ్ముపైనా ఎటువంటి విచారణ జరపకుండా బెయిల్‌ ఎలా దక్కించుకున్నారు?

87. కార్మెల్‌ ఏషియాలో క్విడ్‌ ప్రోకో వ్యవహారం ఉందని 4, 6, 8, 9 ఛార్జ్‌షీట్స్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. మరి 23.9.2013న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వస్తున్న రోజే కార్మెల్‌ ఏషియాలో అసలు క్విడ్‌ ప్రోకో లేదని సీబీఐ మెమోలో పచ్చి అబద్ధం చెప్పించడం వెనక కాంగ్రెస్‌తో కుమ్మక్కు కారణం కాదా?

88. జడ్చర్లలో హెటిరో, అరబిందో కంపెనీలు ఒక్కోదానికీ 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలు కేటాయించినందుకు ప్రతిఫలంగా సాక్షిలో అరవిందో 10 కోట్లు, హెటిరో 19.50 కోట్లు పెట్టుబడులు పెట్టాయని సీబీఐ మొదటి ఛార్జిషీట్‌లో చెప్పింది. ఇది నిజమే కదా?

89. మీ జగతిలో టీఆర్‌ కన్నన్‌ రూ.5 కోట్లు, మాధవ్‌ రామచంద్ర రూ.19.65 కోట్లు, ఎ.కె.దండమూడి రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆ తరవాత వారిని బెదిరించినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడి చేసిన మాట వాస్తవం కాదా?

90. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ అక్రమాలు చేయలేదని షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ లు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా?

91. అనిల్ వ్యాపార భాగస్వామి, బెనెటా కంపెనీ ఎండీ కొండలరావు వద్ద పనిచేస్తున్న వీరభద్రా రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక బ్రదర్ అనిల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానం ఏమిటి? ఇదంతా బయ్యారం గనుల గురించే కదా?

92. సాక్షి పత్రిక, ఛానల్ నష్టాలలో వున్నా కూడా జీతాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? నీ బ్లాక్ మనీ అంతా సాక్షి లో తోసేసి, సాక్షి పత్రిక కి లాభాలు వస్తున్నాయి అని మభ్య పెడుతున్నారా?

93. నెల్లూరు లోని కృష్ణ పట్నం పోర్ట్ సెజ్ లో భాగం గా 5000 ఎకరాలు ప్రభుత్వ భూములు తెరగా కొట్టేసింది నీ బినామీలే కదా?

94. కృష్ణ పట్నం పోర్ట్ సెజ్ భూములని తాకట్టు పెట్టి నవయుగ గ్రూప్ రూ1050 కోట్లు బ్యాంక్స్ నుండి ఋణం తీసుకోవడం నిజం కాదా? ఆ డబ్బులు ఇప్పడు ఎక్కడ ఉన్నాయి? ఎవరికీ చేరాయి? నీకెంత ముట్టింది? కనీసం నువ్వైనా చెప్పగలవా?

95. వీటికి ప్రతిఫలం గానే నవయుగ గ్రూప్ కు చెందిన ఈశాన్య భారత్ లోని హైడల్ పవర్ ప్లాంట్ ను నువ్వు, నీ కుటుంబం, నీ బినామీ లు కొట్టెయ్యడం నిజమే కదా! వీటిని ఆడిటర్ లు కూడా నిర్ధారించారు కదా! ఆ రిపోర్ట్ ను నీ పత్రిక లో ప్రచురించే దమ్ముందా?

96. నవయుగ గ్రూప్ కు సంబంధించిన కృష్ణ పట్నం పోర్ట్, సెజ్, మచిలీ పట్నం పోర్ట్, విద్యుత్ ప్లాంట్స్, వీటితో నీ అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ వనరుల దుర్వినియోగం మీద సిబిఐ విచారణకు సిద్దమేనా?

97. విలువలు గురించి మాట్లాడే నువ్వు, ఇడుపులపాయలో నీ కుటుంబం అసైన్డ్ భూములు అనుభవించడం నిజం కాదా? మీ నాన్నే ఒప్పుకున్నాడు కదా. ఇప్పటికీ అక్కడ 2000 ఎకరాలు నీ కుటుంబం, కంపెనీల పేరు మీదే ఉన్నాయి కదా? వాటిని ప్రభుత్వానికి ఇచ్చేయ్యగలవా?

98. విదేశాలనుండి, లండన్, లక్సంబర్గ్‌, సింగపూర్, మారిషస్, దుబాయ్ నుండి నీ కంపెనీలలో కి వచ్చిన పెట్టుబడుల గురించి ఏమి చేప్తావు, అవన్నీ కూడా నీ అవినీతి సొమ్మే కదా, సిబిఐ కూడా అదే చెప్పింది కదా? నీ నల్ల డబ్బు ని తెల్ల గా మారుస్తున్నావు కదా?

99. ఇంకా ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే నీ ధన దాహం తీరుతుంది? ఒక్క కుటుంబానికి 10 లక్షల కోట్లు అవసరమా, ఈ డబ్బుతో ఆంధ్ర నిర్మాణాన్ని అద్భుతం గా చేయొచ్చు కదా!

100. నీకున్న రాజమహల్ లను (కడప, హైదరాబాద్, బెంగళూరు, జోధపుర్, ఢిల్లీ) చూడడానికి, మీడియా ను అనుమతించే దమ్ము ఉందా?

101. రాష్ట్రం మొత్తం మీద క్రిస్టియన్ మెషినరీ ఆస్తులు, భూములు దోచుకున్న ది నీ కుటుంబమే (బావ అనిల్, మామ రవీంద్ర నాధ్) కదా, వీటి మీద సిబిఐ విచారణకు సిద్దమా? అంత దమ్ము దైర్యం ఉందా?

102. అక్రమాస్తుల కేసులో నీ ఒక్కరికే బెయిల్ వచ్చి, మరెవరికీ బెయిల్ రాకపోవడానికి కారణం ఏమిటి, ఒకే కేసులో ఇదెలా సాధ్యం?

103. ప్లూరి ఎమర్జింగ్, 2ఐ కాపిటల్ నీ బినామీ లే కదా, నీ కాంపౌండ్ కుక్క అయిన సాయి రెడ్డి ఈ కంపెనీలో డైరెక్టర్ కాదా? వీటి నుండే ఇండియా లోని నీ కంపెనీలకు ( సండుర్ పవర్), అక్కడ నుండి నీ వ్యాపార సామ్రాజ్యానికి పెట్టుబడులు వచ్చాయి? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా.

104. నీ అక్రమ వ్యాపారాల మీద, అవినీతి మీద పరిశోధన చేసే దమ్ము, దైర్యం, తెలివి, నీ మీడియా కు ఉందా?

105. నీ కంపెనీల వాటా (సండుర్) ఎక్కువ ధరకు కొన్ని కంపెనీలకు ( చెన్నై కంపెనీలు) అమ్మి, అవే కంపెనీలను కారు చవకగా మరో సాయి రెడ్డి కంపెనీ (కీలాన్) చేత కొనిపించి, ఈ కంపెనీని నువ్వు కారు చవకగా హస్త గతం చేసుకోవడం మాకు తెలియదా? ఇలా నీ నల్ల డబ్బు ని తెల్ల గా మార్చుకోవడం నిజం కాదా? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా.
106. కోస్తా ప్రాంతం లో… శ్రీకాకుళం బీచ్ సాండ్స్ – 8000 కోట్లు, వి.వి. మినరల్స్ -2000 కోట్లు, వంతాడ లాటరిటే -1000 కోట్లు, వైట్ ఫీల్డ్ సెజ్ -100 కోట్లు, కాకినాడ సెజ్, పోర్ట్ – 5000 కోట్లు, వాన్ పిక్ -20000 కోట్లు, మిడ్ వెస్ట్ గ్రానైట్ -10000 కోట్లు , మంగం పేట -1000 కోట్లు, సరస్వతి పవర్ – 30000 కోట్లు, భారతి సిమెంట్ -6000 కోట్లు, నెల్లూరు లో పవర్ ప్లాంట్స్, భూములు, ఎయిర్ పోర్ట్ – 30000 కోట్లు, ఆన్ రాక్ అల్యూమినియం – 100000 కోట్లు లాంటివి నీ అవినీతి సామ్రాజ్యానికి మచ్చు తునకలే కదా.

107. సర్కారీ ఉత్తర్వులు, కనీస అవగాహన పత్రాలు సైతం లేకుండానే ‘నీకిది నాకది’ పంథాలో రాష్ట్రం సొంత జాగీరు అయినట్లుగా వేల ఎకరాల్ని అస్మదీయులకు వైఎస్‌ ఎలా రాసిచ్చేశారో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ బాగోతం నిర్ద్వంద్వంగా చాటుతోంది, దీనిని కాదనే దైర్యం ఉందా?

108. అచిర కాలంలోనే అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు?’- సర్వోన్నత న్యాయస్థానం జగన్‌కు వేసిన సూటి ప్రశ్న అది, దీనికి సమాధానం చెప్పే నైతిక విలువలు నీకున్నాయా?

109. వైఎస్‌ తన ఏలుబడిలో దాదాపు లక్ష ఎకరాల సంతర్పణలతో- జగన్‌ను నడమంత్రపు సిరిమంతుణ్ని చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట జనం కళ్లకు గంతలు కట్టి, గుట్టుచప్పుడు కాకుండా జగన్‌ సంస్థల్లోకి పెట్టుబడుల రూపేణా లంచాలు రాబట్టి, కనీవినీ ఎరుగని అవినీతి మహా సామ్రాజ్యాన్నే నిర్మించారు. దీనికే మంటావు?

110. నిజాయతీ పరుడైన అధికారిని పక్కకు తప్పించి, జగన్‌తో కుమ్మక్కై కేసుల్ని నీరుగారుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఈ పాపంలో భాగం లేదా? నీ బెయిల్ కోసం 1200 కోట్లు ఇచ్చింది నిజం కాదా?

111. 2003-’04లో జగన్‌ చెల్లించిన పన్ను పట్టుమని మూడు లక్షల రూపాయలైనా లేదు. 2010-’11 నాటికి వార్షికాదాయం రూ.500కోట్లుగా లెక్క గట్టి, ఆరు నెలల కాలానికి రూ.84కోట్లు పన్ను చెల్లించేటంత స్థోమత జగన్‌కు ఎలా దఖలుపడిందో?
112. రాయలసీమ ప్రాంతం లో: బ్రాహ్మణి స్టీల్ -2000 కోట్లు, ఓబులాపురం మైన్స్- 20000 కోట్లు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ – 2000 కోట్లు, పెన్నా సిమెంట్స్ – 3000 కోట్లు, శ్రీ సిటీ -4000 కోట్లు, భారతి సిమెంట్స్ – 6000 కోట్లు, మంగం పేట గనులు – 2000 కోట్లు లాంటివి కరువు సీమ, ఖనిజాల గని రాయలసీమ లో నీ అవినీతి సామ్రాజ్యానికి ఒక చిన్న భాగమే కదా?

113. సాక్షి తో సహా, ఎన్.టివి. టివి 5 లాంటివి నీ బినామీ లే కదా? తుమ్మల నరేంద్ర, నిమ్మగడ్డ, నాగార్జున, కెవిపి నీ కాంపౌండ్ లో కుక్కలే కదా? నీ ఛానల్ చూడటం లేదని, వీటిని అరువు తెచ్చుకోవడం నిజం కాదా, దొంగ సర్వే లు ప్రసారం చెయ్యడానికి 40 కోట్లు ఖర్చు పెట్టడం నిజమే కదా, దీనికైనా సమాధానం ఉందా?

114. మీ కుటుంబ లెక్కలు చూసే ఛార్టెడ్ అకౌంటెంటు విజయసాయిరెడ్డికి అర్హత లేకున్నా ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా నియమించి మీరు ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా అనేక విషయాలు దాచిపెట్టి అతన్ని రిజర్వు బ్యాంకు డైరెక్టర్ గా నియమించేందుకు సిఫార్సు చేశారు. సొంత వారిని అందలం ఎక్కించడం భావ్యమా?

115. మీ శిష్యుడు సునీల్ రెడ్డి పేదరికంతో అల్లాడిన దిగువ మధ్యతరగతి యువకుడు. అలాంటి వ్యక్త కోట్లకు పడగలెత్తాడు అంటే మీ చలువ కాదా? పులివెందుల ప్రజలు అతని పురోగతి చూసి నివ్వెర పోవట్లేదా? చివరికి ఎమ్మార్ కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు (నిజానికి మీరే అయినా) అతనేనని సీబీఐ తేల్చలేదా?

116. మీరు, మీ నాన్న, మీ బావ అనిల్, మీ తండ్రి ఆత్మ కేవీపీ, అనుచరుడు సూరీడు, మీ అనుయాయి సునీల్ రెడ్డి, మీ లెక్కల మాస్టారు విజయసాయిరెడ్డి, మీ బాబాయ్ వైవీ.సుబ్బారెడ్డి, మీ మావయ్య రవీంద్రనాథ్ రెడ్డి, మీ మరో మావయ్య క్రిస్టోఫర్ అందరూ కలిసి రాష్ట్రాన్ని పంచుకుంటారా? మీరిచ్చే రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు చూసి మీది దేవుడి పాలన అనే భ్రమల్లో ప్రజలను ఉంచి మీ వాళ్లందరికీ తర తరాలకు సరిపడ సంపద పోగేయటం విశ్వసనీయతా? ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంచుతారు ప్రజలను?

117. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భార్యల బృందంలో మీ పార్టీ నాయకులు, వారి భార్యలు కలిసి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లడం ఇరు పార్టీల సఖ్యతకు నిదర్శనం కాదా?

118. సుప్రీంకోర్టు జగన్‌ అక్రమాస్తుల విషయంలో తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన తరవాత ఒక పథకం ప్రకారం మీ కుటుంబ సభ్యులు సోనియాగాంధీతో చీకటి ఒప్పందం చేసుకొని విచారణను నీరుగారేలా చూసుకొన్నారా? లేదా?

119. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో రాజీ కుదర్చమని అమెరికన్‌ అంబాసిడర్‌ని బ్రదర్‌ అనిల్‌ ప్రాధేయపబడలేదా? ఢిల్లీ వెళ్లి అహ్మద్‌ పటేల్‌ని విజయసాయిరెడ్డి సంప్రదించలేదా? బెంగళూరు మీదుగా రహస్యంగా వెళ్లి సోనియాను కలిసి బెయిల్‌ తెచ్చుకోలేదా?
120. మీ తండ్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కీలక వ్యవస్థల్ని ఏ కీలుకా కీలు విరిచి లక్ష కోట్లు ప్రజాధనాన్ని దోచేసినందుకు మీకు అధికారం కట్టబెట్టాలా?

121. ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న తమ లాంటి కుటుంబాల్ని కాంగ్రెస్ నాయకత్వం నట్టేట ముంచిందని జేసీ దివాకర్ రెడ్డి, దత్తపుత్రుడైన మీ కోసం తెలుగువాళ్ల గొంతు కోశారని ఎంపీ లగడపాటి, తమ నాయకత్వం వల్లే మీకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. జనం అంతా విన్నారు. దీనికి సమాధానం నీ దగ్గర ఉందా?

122. ఫీజు పధకం లో 2000 కోట్లు, ఆరోగ్య శ్రీ లో – 1000 కోట్లు, రేషన్ బియ్యం లో -1000 కోట్లు, మద్యం లో – 2000 కోట్లు మీ కుటుంబ ఖాతాలోకి వెళ్ళడం నిజం కాదా? ఈ పధకాల పైన విచారణకి సిద్దమా?

123. జగన్‌కు బెయిల్ వచ్చిన రోజే రూ.12 వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా అయ్యాయని, జులై 12న దిగ్విజయ్‌ సింగ్‌కు రూ. 300 కోట్లు వెళ్లాయని పలువురు ఆరోపించారు, వీటిపై విచారణకి సిద్దమా?

124. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించినది, దోపిడీ నేర్పినది నీ నాయన కాదా, నీ నాయన కున్న కొద్దిపాటి పేరు కూడా చేడడానికి నీ అవినీతి, ధన దాహమే కదా ప్రధాన కారణం. కోర్ట్ లు, సంస్థలు, ప్రజలు కూడా ఇదే ధృవీకరించారు కదా?

125. ఖమ్మం జిల్లా గార్లలో నీ మావయ్య రవీంద్రనాధ్ రెడ్డి గిరిజనులను బినామీ గా పెట్టి బైరటీస్ ఖనిజం ను దోచుకోవడం లేదా, దీనిపై సిబిఐ విచారణకి సిద్దమా?

126. రంగారెడ్డి జిల్లాలో భూములను పరిశ్రమలు, సెజ్ ల పేరుతో బినామీ పేర్ల మీద కొట్టేయడం నిజం కాదా? దీనిపై సిబిఐ విచారణకి సిద్దమా?

127. సిక్కిం లో 1200 మెగా వాట్స్ ప్రాజెక్ట్ లో 50% వాటా ఎక్కడ నుండి వచ్చింది, ఈ పెట్టుబడి కి ఆధారమేది? ఎవరికీ ఏమి దోచిపెట్టి ఈ ప్రాజెక్ట్ ఆక్రమించావు?

128. రఘురాం సిమెంట్ కు వేల ఎకరాల సున్నపురాయి, 400 ఎకరాల భూములు, నీ నాయన చేత కేటాయించు కొన్నావు కదా! ఇదే మన్నా నీ తాత ముల్లా?

129. కర్నాటక లో సండుర్ పవర్ ప్రాజెక్ట్ కోసం వేల ఎకరాలు కొన్నావు కదా! వీటికి అంత సోమ్మేక్కడిది?

130. రహేజా సంస్థకు ఇచ్చిన 200 ఎకరాలలో 50% వాటా కొట్టెయ్యడం నిజమే కదా? ముంబై లో నీ నాయన , రహేజాలు పలు కుంభకోణాల మీద ఒప్పందం చేసుకోవడం నిజం కాదా?

131. గంగవరం పోర్ట్ లో 50% వాటా లాక్కోవడం నిజమే కదా? అందుకే కదా, నీవు, నీ నాయన ధర్నా చేస్తున్న గంగపుత్రులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుంది?

132. చీమకుర్తి లోని గెలాక్సీ గ్రానైట్ ను జిమ్పెక్ష్, మిడ్ వెస్ట్ కంపెనీకి ఇచ్చిన 150 ఎకరాలలో నీకు దక్కినది ఎంత? దీని వలన ప్రభుత్వ ఖజానాకి 11000 కోట్లు నష్టం కాదా? దీనిపై సిబిఐ విచారణకి సిద్దమా?

133. విశాఖ లోని అన్ రాక్ అల్యూమినియం కంపెనీ నీ బినామీ అయిన పెన్నా ప్రతాప్ రెడ్డి దే కదా? దీనిపై సిబిఐ విచారణ కూడా జరుగుతోంది కదా. దీనేకేమంటావ్?

134. ప్రకాశం లోని ఐరన్ ఒర్ నిక్షేపాల వెలికితీత ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వకుండా చెన్నై కి చెందినా జిమ్పెక్స్ సంస్థకు ఇవ్వడం లో ఆంతర్యం ఏమిటి? దీని వలన రాష్ట్రానికి 5000 కోట్లు నష్టం, నీకు ముట్టినది ఎంత?

135. ఎమ్మార్ – ఎం.జి.ఏఫ్ స్కాం లో ఎంత తిన్నావు? దీనిలో ఏ.పి.ఐ.ఐ.సి వాటాను 26% నుండి 5% నికి కారు చౌకగా తగ్గించి ఎమ్మార్ దగ్గర ఎంత నోక్కేసావు? దానికి ప్రతిఫలం గానే కోనేరు ప్రసాద్ కు విజయవాడ ఎం.పి సీటు ఇచ్చావు. ఈ స్కాం లో వున్నది అంతా కూడా నీ కాంపౌండ్ కుక్కలే కదా!

136. రహేజా మైండ్ స్పేస్ లో ఏ.పి.ఐ.ఐ.సి వాటాను 11% నుండి 0.001% నికి కారు చౌకగా తగ్గించి రహేజా ల దగ్గర ఎంత నోక్కేసావు?

137. ఈ రాష్ట్రం లో ఖనిజ దోపిడీ మొదలు అయ్యింది మీ కుటుంబం నుండే కదా! ఇప్పటి రాష్ట్ర ఖనిజ సంపద మీ కుటుంబం చేతుల్లోనే వుంది కదా! ఇనుపఖనిజం-ఖమ్మం, ప్రకాశం, అనంతపురం, సున్నపురాయి – కృష్ణ, గుంటూరు, నల్గొండ, రంగారెడ్డి, బీచ్ సాండ్స్ – కోస్తా తీరం, బాక్సైట్ – విశాఖ, దీని పై సుప్రీమ్ కోర్ట్ సిట్టింగ్ జడ్జి విచారణకి సిద్దమా?

138. భూగర్భ సంపద రస్ ఆల్ ఖైమా, పెన్నా ప్రతాప్ రెడ్డి లకు కట్టబెట్టి ఆదివాసీ, గిరిజనుల హక్కులు కాలరాయలేదా?

139. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన నిమ్మగడ్డ ప్రసాద్ తను కంపెనీలు పెడతాడు గానే, లేదా తనకన్నా గొప్ప పారిశ్రామికవేత్తల కంపెనీలలో పెట్టుబడులు పెడతాడు గానీ నీ కంపెనీలోనే ఎందుకు పలు విడతలుగా 900 కోట్లకు పైనే పెట్టుబడి పెట్టాడు. ఇవన్నీ ముడుపులే కదా? నీ నల్ల డబ్బే కదా!

140. పొట్లూరి వరప్రసాద్ నీ కంపెనీలో 146 కోట్లు పెట్టుబడి పెట్టాడు, నీ పార్టీ లో వున్నాడు, ఇప్పుడు విభేదించి బయటికి పోయాడు, కానీ ఆ 146 కోట్ల పెట్టుబడి ని తిరిగి ఇచ్చావా? లేదా? తిరిగి ఇవ్వకపోతే, ఇది అవినీతి సొమ్ము, నీ నల్ల డబ్బు అనుకోవాల్సి వస్తుంది! దీనికి సిద్దమేనా?

141. లాంకో కు చెందినా జూబ్లీ మీడియా 30 కోట్లు సాక్షి లో పెట్టినందుకు లాంకో హిల్స్ కి రాయితీలు ఇచ్చారు అది నిజమే కదా! రాజగోపాల్ కు ఆ డబ్బు తిరిగి ఇచ్చేశావా? లేక అవి కూడా అర్పనమేనా?

142. సాక్షి పత్రిక లో, మీడియా లో విదేశీ పెట్టుబడులన్నీ కూడా ఫెమా ఉల్లంఘనలే కదా! వీటికి చట్టాలు ఒప్పుకోవు, ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి, వాటిని కూడా ఆర్.బి.ఐ స్థాయి లో ఫెమా నిబంధనలను సైతం నీరుగార్చారు కదా! దీనికి నీ నాయన, వై.వి.రెడ్డి, సోనియా, చిదంబరం సహకరించారు కదా!

143. మహబూబ్ నగర్ లో పోలే పల్లి సెజ్ లో వందల ఎకరాలు ఇచ్చినందుకు కదా, వీళ్ళు నీ పత్రిక లో పెట్టుబడి పెట్టారు. 144. నీ పత్రిక, మీడియా లో పెట్టుబడులు పెట్టిన వందల మంది వాటాదారులకు ఇప్పటిదాకా, ఏవైనా లాభాలు పంచావా, లేక నువ్వే బొక్కేశావా? ఎవరికైనా వారి పెట్టుబడి తిరిగి ఇచ్చేశావా? లేక తేరగా నోక్కేసావా?

145. నీ జీవితం లో ఒక్క టైనా నిజాయితీ గా చేశావా, అన్నీ కూడా ఫేక్ కదా! ఫేక్ నోట్స్, ఫేక్ సర్వే, ఫేక్ పెట్టుబడి, ఫేక్ న్యూస్ ఇలాగా. నీ బ్రతుకే ఒక ఫేక్ కాదా!

146. జలయజ్ఞం లో కొన్ని వేల కోట్లు దోచింది నీ బినామీ కంపెనీలు అయిన మెయిల్, ఇందు, ఐ.వి.ఆర్.సి.ఎల్, కె.ఎం.సి లే కదా? 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా? వీటిపై సిబిఐ విచారణకి సిద్దమా?

147. నీ లాంటి అవినీతిపరుడు ఆంధ్ర లో అధికారం లోకి వస్తే, ఒక్క పారిశ్రామిక వేత్త అయినా, ప్రవాసాంధ్రులు అయినా ఆంధ్ర లో పరిశ్రమలు పెడతారా? హైదరాబాద్, తెలంగాణా నుండి ఒక్క ఆంధ్ర వాళ్ళ పరిశ్రమ అయినా సీమాంధ్ర కి తరలి వస్తుందా ? నీ చరిత్ర అంత గొప్పది మరి.

148. నీ నిర్వాకం వలన, ఒక్క ఐఏఎస్ అయినా ఆంధ్ర లో పనిచేయడానికి ముందుకు వస్తాడా? నీ అవినీతి ని తట్టుకోలేకే కదా ఐఎఎస్ లు ఆంధ్ర కు రావడం లేదు, వాళ్ళు నీ బెడద లేని తెలంగాణా లోనే ఉంటాము అంటున్నారు.

149. కేజీ బేసిన్ గ్యాస్ వెలికి తీసే కంపెనీలో, కడప లో ఉక్కు పరిశ్రమ పెట్టడానికి వచ్చిన కంపెనీలో 20% ఉచిత వాటా అడిగావు, లేకపోతే ఆంధ్ర లో వ్యాపారం చెయ్యనివ్వను అన్నావ్, అది నిజమే కదా. ఇది నీ నాయనకు, సోనియా కు కూడా తెలుసు కదా! వాటి కాల్ రికార్డ్స్ కూడా సోనియా దగ్గర ఉన్నాయి కదా.

150. నువ్వు అంత పవిత్రుడవే అయితే, సోనియా కు నువ్వు-కెవిపి, వైఎస్ ఇచ్చిన ముడుపుల చిట్టా ఉన్న డైరీ ని బయట పెట్టొచ్చు కదా? అది చూపించే కదా అప్పట్లో సోనియా ను బెదిరించావు.

151. అసలు అవినీతి పైన నీ వైఖరి, నీ పార్టీ వైఖరి ఎప్పుడైనా చెప్పారా? కళంకితులు టికెట్స్ పై మీకేమైనా విధానం ఉందా? ఇది మీ మేనిఫెస్టో లో పెట్టె దమ్ము ఉందా? ఒక రాజకీయ పార్టీ కి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా!

152. నీ వ్యక్తిగత ఆదాయం దేశ, రాష్ట్ర బడ్జెట్ కన్నా వేగం గా పెరిగి పోతోంది కదా, ఆంధ్ర లో ఉన్న లోటు బడ్జెట్ ను ఎలా తీరుస్తావో, కనీసం నీ ఎన్నికల మేనిఫెస్టో లో అయినా చెప్పగలవా? మాకు వినాలని వుంది నీ ధనార్జన సూత్రాలని. ఈ క్లిష్ట సమయం లో ఈ ధనార్జన సూత్రాలు చాలా అవసరం.

153. ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికి తీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో… రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1.85 కోట్ల డాలర్లు (మన లెక్కలో చెప్పాలంటే 110.81 కోట్ల రూపాయలు) లంచాలుగా మేపేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయ్యిందని స్పష్టమైంది. ఈ అక్రమ దందా అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీనిని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. దీని మీద నువ్వు స్పందిస్తావా, నీ విష పత్రిక సాక్షినా? లేకపోతే మీ నాయన ఎలాగూ పోయాడు కాబట్టి కెవిపి మీద తోసేస్తావా?

154. టైటానియం లీజుల స్కాం సి నిందితుడు గా పేర్కొన్న వైఎస్ దగ్గర బంధువు నువ్వే కదా? దీనిపై వివరణ ఇచ్చే సంస్కారం నీకు ఉందా?

155. విలువైన ఖనిజం టైటానియంను విదేశీయులకు వైఎస్‌ జమానాలోనే దోచిపెట్టారు. 111 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కుల బండారంపై మీరు ఎందుకు మాట్లాడ లేకపోతున్నారు?

156. డిఎఫ్ కంపెనీ తో బేరాలు కుదరక, వాటాలు రాక రద్దు అయిన టైటానియం మైనింగ్ ప్రాజెక్ట్ ను ఎమ్మార్ -ఎం.జి.ఏఫ్ కుంభకోణం లో ప్రధాన నిందితుడు అయిన కోనేరు ప్రసాద్ కు చెందిన ట్రైమాక్స్ సాండ్స్ కంపెనీకి ఇచ్చారు. దీని పైన విచారణకు సిద్దమా? ఈ లీజులు రద్దు చెయ్యమని ప్రభుత్వాన్ని కోరే దమ్ము ఉందా?

157. ట్రైమాక్స్ సాండ్స్ కంపెనీలో జగన్ కు, జగన్ బంధువు వైఎస్. సుదీకర్ రెడ్డి, జగన్ బినామీ లకు వాటాలు ఉన్నాయి. అసలు జగన్ బినామీ నే ఈ కోనేరు ప్రసాద్. దానికి ప్రతిఫలమే కోనేరు ప్రసాద్ కు వైకాపా తరపున విజయవాడ ఎం.పి. సీటు. దీని గురించి ఏమంటావ్? నువ్వు కోరుకున్నట్టు గానే ముడుపులు కాకుండా, ఏకంగా వాటానే కొట్టేసావుగా!

158. ఎఫ్.బి.ఐ. ఛార్జ్ షీట్ లో “c” నిందితుడు మన జఘనుడే లేదా వీడి బాబాయి వైఎస్. సుదీకర్ రెడ్డి, అంటే ఈ జఘనుడు కి బినామీ నే ఈ వైఎస్. సుదీకర్ రెడ్డి ( అమెరికా సిటిజెన్ కావున), జగన్ తరపున అమెరికా లో ముడుపుల వ్యవహారాలు చక్కబెట్టేవాడు. సుదీకర్ రెడ్డి నుండి ఆ 111 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో చెప్పే, పరిశోధన చేసే దమ్ము ఉందా? ఈ సాక్షి కి. ముడుపులు కాకుండా వాటా ల కోసం వైఎస్. సుదీకర్ రెడ్డి ముందు పెట్టి పట్టు బట్టింది ఎవరు? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు, ఈ మహా మేత కుటుంబం లో నీటి గా బతికినవాడు ఒక్కడూ లేడా? కోనేరు-వైఎస్. సుదీకర్-జగన్ లది ఎడతెగని స్కాంల బంధం కాదా!

159. మీ నాయన పేరు ఎఫ్.బి.ఐ కేసులో వచ్చినందుకైనా కూడా కనీసం ఖండించాల్సింది. అంటే, జగన్ కోసం చచ్చిన వైఎస్ ను బలి పెట్టారు, అనే కదా అర్ధం!
160. సిబిఐ కేసులలో నీ నాయన పేరు వస్తే నే, రాజీనామా చేసి ఉపఎన్నికలు వెళ్ళిన వాళ్ళు, అత్యంత శక్తివంతమైన ఎఫ్.బి.ఐ కేసులో నీ నాయన పేరు వస్తే కుక్కిన పేను లా పడి వున్నారు! నీ నాయన ప్రతిష్ట కాపాడుకోవడానికి, కనీసం ఎఫ్.బి.ఐ ని సవాల్ చేసే దమ్ముందా?

161. ఎమ్మార్ కుంభకోణం లో నీ పేరు డైరెక్ట్ గా లేకపోయినా కూడా, నీ బంధువు, బావ మరిది సునీల్ రెడ్డి కి ఆ వందల కోట్ల ముడుపులు అందాయి, ఆ తరువాత ఆ ముడుపులు, సునీల్ రెడ్డి కంపెనీల ద్వారా, నీ కంపెనీల లోకే వచ్చాయి, అనే విషయం సిబిఐ, పత్రికలు బయట పెట్టిన విషయం మర్చిపోయావా? ఈ టైటానియం కుంభకోణం లో కూడా ఇదే కదా జరిగింది.

162. ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డి పాత్ర, టైటానియం కుంభకోణం లో వైఎస్. సుదీకర్ రెడ్డి పాత్ర ఒక్కటే కదా! వీళ్ళ పని ముడుపుల డబ్బు ని బట్వాడా చెయ్యడమే కదా. ఇది జగమెరిగిన సత్యమే కదా!

163. ఎమ్మార్ కేసులో కూడా ముడుపులు అందుకున్న సుదీకర్ రెడ్డి నుండి, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయో తేల్చాల్సి వుంది. దమ్ముంటే, ఆ ముడుపుల అంతిమ గమ్య స్థానం పై విచారణకి సిద్దమా, ఎఫ్.బి.ఐ కి , సిబిఐ కి దీని మీద లేఖ రాసే దమ్ముందా?

164. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు సంబందించిన రూ 96 కోట్లు మీ స్నేహితుడు సునీల్ రెడ్డి, మీ పార్టీ అభ్యర్ధి కోనేరు ప్రసాద్ లు పంచుకున్నది వాస్తవమా కాదా?

165. కని మొళి, సురేష్ కల్మాడీ, లాలూ, మాయావతి, ఇతరుల సిబిఐ కేసులమీద వార్తలు రాసే నీ విష పత్రిక నీ స్కామ్స్ గురించి పరిశోధనాత్మక వ్యాసాలు, కధనాలు ఎందుకు ప్రచురించదు? ఆంధ్ర జనాలు గోర్రేలనా మీ ఉద్దేశ్యం?

166. నీ అల్లి బిల్లి దొంగ కంపెనీల చిరునామాలు, నీ అవినీతి భాగస్వాములు అయిన గాలి కంపెనీలు, నీ బావ కంపెనీలు, నిమ్మగడ్డ కంపెనీలు, పెన్నా ప్రతాప్ రెడ్డి కంపెనీలు, మరెన్నో కంపెనీల చిరునామాలు ఒక్కటే కదా! ఇంతకన్నా రుజువులు కావాలా, మీరంతా ఒకే పుట్టలో పాములే అని చెప్పడానికి?

167. తెలంగాణా లో ఎక్కడా అడ్రస్ లేని వైకాపా, ఒక్క ఖమ్మం లోనే ఎన్నికలకు ఎందుకు కోట్లు కుమ్మరిస్తోంది? ఇదంతా 700 లక్షల కోట్ల విలువ చేసే బయ్యారం గనుల కోసమే కదా! ఇది అప్పట్లో నీ నాయన నీ చెల్లి కి ఆడపడుచు కట్నం గా ఇచ్చాడు కదా! అందుకేనా సిపిఎం ను దువ్వుతున్నావు? నీ అవినీతి కి అసలు అంతే ఉండదా?

168. చివరికి జి.ఎం.ఆర్ గ్రూప్ ని కూడా బెదిరించి కోలకతా కంపెనీల ద్వారా, వాటి ముసుగులో జి.ఎం.ఆర్ ఇచ్చిన లంచం డబ్బు రూ 50 కోట్లు ను నీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టించుకోలేదా? సిబిఐ కూడా ఛార్జ్ షీట్ లో ఇదే చెప్పింది కదా!

169. నువ్వు గనుక పొరబాటున ఆంధ్ర లో అధికారం లోకి వస్తే, ఆంధ్ర కి నువ్వు తెచ్చే, వచ్చే పరిశ్రమలు అన్నీ కూడా నీ నల్ల డబ్బు ని విదేశాలనుండి ఇక్కడికి తెచ్చేవే కదా!

170. దేశంలో బిజెపి ద్రుష్టి లో పడడానికి, జాతీయ స్థాయి ఇమేజ్ కోసం సంవత్సరానికి 100 కోట్లు, ఎన్.డి.టి.వి, సిఎన్ఎన్.-ఐ.బి.ఎన్, ఇండియా టుడే లకు ఇచ్చేది నువ్వే కదా! ఇంత డబ్బు నీకేక్కడిది, చెప్పగలవా?

171. వాన్ పిక్ లోకి నీ నల్ల డబ్బు 2000 కోట్లు ను విదేశీ పెట్టుబడి (FDI) ముసుగు లో తేవాలని చూసావు, కానీ FIPB ఈ ప్రతిపాదనను తిరస్కరించింది కదా! ఎందుకంటే ఈ విదేశీ పెట్టుబడిదారుల (మారిషస్ కంపెనీలు) పూర్తి వివరాలను నిమ్మగడ్డ ప్రసాద్ ఇవ్వలేకపోయాడు కనుక. ఎవరో కూడా తెలియకుండా 2000 కోట్లు పెట్టుబడి తీసుకుంటారా? ఇదంతా నీ అవినీతి సొమ్మే కదా? వాన్ పిక్ లోకి నీ నల్ల డబ్బు ప్రవహింపజేసి వాన్ పిక్ ప్రాజెక్ట్ ను పూర్తిగా హస్తగతం చేసుకోవాలని చూసావు కదా! మాకు తెలియదు అనుకుంటున్నావా?

172. ఇది కుదరక పోతేనే, నీ బినామీ అయిన నవయుగ గ్రూప్ వాన్ పిక్ ను టేక్‌ ఓవర్ చేసి నీ ఋణం తీర్చు కోలేదా? వాన్ పిక్ ప్రాజెక్ట్ కోసం ఇన్ని కష్టాలు పడ్డావు అంటే అది నీదే అని కదా అర్ధం!

173. నీ నాయన జరిపిన గనుల పందేరం లో ఎ.పి.ఎం.డి.సి కి 10000 కోట్లు నష్టం రావడం నిజమే కదా! ఈ రాష్ట్రం లో ఉన్న గనులు (బాక్సైట్, గ్రానైట్, బీచ్ సాండ్, టైటానియం, ఐరన్,లాటరైట్, బైరటీస్, వజ్రాలు) అన్నీ కూడా నీ కుటుంబానికే, బినామీలకే కదా కట్టబెట్టారు. ఈ నివేదిక పై స్పందించే దమ్ము నీ పత్రికకు ఉందా!

174. వైకాపా తరపున ఒక్క నీతి మంతుడికైనా టికెట్ ఇచ్చావా? అందరూ దొంగలూ దగుల్బాజీలే కదా నీ పార్టీ అభ్యర్ధులు! కోనేరు, బాలసౌరి, తోట చంద్రశేఖర్, మేకపాటి, ధర్మాన, పార్థ సారధి, వీళ్లా మీ అభ్యర్ధులు!

175. విశాఖ లో సాగించిన భూ దోపిడీ, గనుల దోపిడీ, వనరుల దోపిడీ ని, అవకాశాల దోపిడీ ని కొనసాగించడానికే కదా నీ అమ్మ, విజయమ్మ ను విశాఖ నుంచి పోటీ కి పెట్టావు!

176. చివరకు, రైతులకు దక్కాల్సిన ఎరువులలో కూడా మీ కుటుంబం ప్రవేశించి వాటిని బ్లాకు మార్కెట్ కు అమ్ముకోవడం నిజం కాదా!

177. రైతులకు ఇవ్వాల్సిన ఎరువులను బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డి మిక్సింగ్‌ ప్లాంట్లకు తరలించలేదా? మట్టి కలిపి నకిలీ ఎరువులు తయారు చేసి రైతులను మోసం చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడింది వైఎస్‌ కాదా?

178. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని జలయజ్ఞం ప్రారంభించిన వైఎస్‌ హయంలో 2004 నుంచి 2009 వరకు రూ.55వేల కోట్లు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపిస్తున్నారు. వాస్తవంగా సాగులోకి వచ్చిన భూమి ఎంతో చూపించగలరా?

179. నిరర్థకమైన ప్రాజెక్టులు ప్రారంభించి.. తట్ట మట్టి కూడా తీయకుండా బొచ్చెడు కాంక్రీటు కలపకుండా మొబిలైజేషన్స్‌ అడ్వాన్సు ఇచ్చి 10శాతం మొత్తాన్ని కమీషన్ల కింద దారి మళ్లించింది మీ తండ్రి కాదా?

180. సమైక్యం గురించి మాట్లాడే నువ్వు, కెసిఆర్ ను ఎప్పుడూ తిట్టక పోవడమే మీ మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి నిదర్శనం, హైదరాబాద్ లో నీ కున్న అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్-కెసిఆర్-జగన్ మధ్య ఒప్పందం కుదిరింది కదా! అందులో భాగమే కదా ఈ ఎన్నికల డ్రామాలు.

181. ఆంధ్ర ప్రదేశ్ విభజన కు ప్రధాన కారణం నీ బిల్ డీల్ కదా! ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లో సి.ఎం అయ్యే అవకాశాలు లేక, రాష్ట్రాన్ని విభజించడానికి సోనియా తో ఒప్పందం చేసుకొని బెయిల్ డీల్ చేసుకున్నావు కదా! ఇదే కదా జైపాల్ రెడ్డి ఎన్నికల తరువాత చెప్పబోయే రహస్యం.

182. కెవిపి రామచంద్ర రావు – వాడి కొడుకు కోటగిరి ఉజ్వల్, మీ నాయన హయాం లో దేశ వ్యాప్తంగా 20 వేల కోట్లతో నిర్మించిన/నిర్మిస్తున్న 4000 మెగావాట్ల విద్యుత్ సామ్రాజ్యం సంబందించిన పెట్టుబడులు, అనుమతులు, అన్నీ ఎక్కడినుండి వచ్చాయి, అవన్నీ నీ నాయన, సోనియా దయ కాదా! నీ అవినీతి గురించి నీ దొంగ సాక్షి లో ఎలాగూ రాయరు, కనీసం కెవిపి అవినీతి, కుంభకోణాల గురించి రాయడానికి మీ కున్న అడ్డేమిటి? కెవిపి వ్యాపారం లో నీ వాటాలు, కమీషన్లు బయటపడతాయని భయమా?

183. బ్రహ్మణీ ఇన్‌ఫ్రాటెక్‌ అనే సంస్థకు మీ తండ్రి శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర 250 ఎకరాలు కేవలం రూ.20 లక్షలకే ఇచ్చేశారు. ఆ కంపెనీ వాళ్లకి బెంగళూరులో నెలకు రూ.30కోట్లు అద్దె వచ్చే మంత్రి బిల్డర్స్‌ అనే సౌధం ఉంది. దాన్ని కేవలం రూ.200 కోట్లకే మీరు కొనుగోలు చేశారు. ఏమిటీ క్విడ్‌ ప్రో కో?

184. జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు స్వచ్ఛందంగా వచ్చినవి కావనీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసి లాక్కున్నారని సీబీఐ ఛార్జిషీట్‌లో తేల్చిందా? లేదా?

185. లోటస్‌పాండ్‌లో 300 కోట్ల రూపాయల విలువైన భవనం (60వేల ఇందిరమ్మ ఇళ్లతో సమానం), బెంగళూరులో 23 ఎకరాల్లో పెద్ద భవంతి (80 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చు), కడప, పులివెందులలో రాజప్రాసాదాలు నిర్మించుకోవడం ఎలా సాధ్యమైంది?

186. రాబర్ట్‌ వాద్రా ‘క్విడ్‌ప్రొకో’ వ్యవహారాలపై దేశంలో అన్ని రాజకీయ పార్టీలూ అభ్యంతరాలు లేవనెత్తినా మీ పార్టీ నోరు విప్పలేదు. మీ బెయిల్‌ ఒప్పందంలో భాగంగానే వాద్రాపై మౌనం వహించారా?

187. 40ఏళ్ల వయసుకే వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి కావడం, వందల గదులతో రాజప్రసాదాలు నిర్మించడం, రూపాయి పెట్టుబడి లేకుండా ఎక్కడా రుణం తీసుకోకుండా రూ.1,250 కోట్లతో మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పడం ఎలాగో రాష్ట్రంలో ఉన్న యువతకి వివరించగలుగుతారా?

188. గుట్టుచప్పుడు కాకుండా తెర వెనక సాగించిన గనుల దోపిడీలు బయటపడుతున్నందుకు మీకు అధికారం ఇవ్వాలా? అవినీతే రాజనీతిగా ఇష్టానుసారం చెలరేగిపోయిన జగన్‌… తాను, తన తండ్రి మాత్రమే నీతి నిజాయతీలకు నిలువుటద్దాలు అన్నట్లు ప్రచారం చేసుకొంటున్నందుకు అధికారం ఇవ్వాలా?

189. ‘నీకిది నాకిది’ ఫార్ములా ప్రయోగించి, లక్షల ఎకరాల భూములు, వేల ఎకరాల గనులు అక్రమంగా అస్మదీయులకు కట్టబెట్టి, తన కంపెనీల్లోకి బెదిరించి వేల కోట్ల పెట్టుబడులు పెట్టించుకున్నందుకు అధికారం ఇవ్వాలా?

190. మీ అవినీతిని ఖండాంతరాలను దాటించి ఆంధ్రప్రదేశ్‌ను అప్రదిష్ఠ పాల్జేసి, తెలుగువారంటే అంతా మోసం, దోపిడి దారులుగా చూసే పరిస్థితి కల్పించింది మీ తండ్రీకొడుకులా కాదా?

191. వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, బ్రదర్‌ అనిల్‌, షర్మిల… మీవాళ్లందరి కోసం నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులు దోచేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ఆక్టోపస్‌లా కబళించిన చరిత్ర మీ కుటుంబానిది కాదా?

192. వైఎస్‌ తమ్ముడు రవీంద్రనాథ్‌రెడ్డి, అల్లుడు అనిల్‌కుమార్‌లు ఏర్పాటు చేసిన సెయిన్డ్‌ హైడ్రో పవర్‌ ప్రై.లి. సంస్థ దేశవ్యాప్తంగా ఆరు భారీ విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. వీటి విలువ 50 వేల కోట్లు. ఇంత సొమ్ము వీరికి ఎక్కడ నుంచి వచ్చింది?

193. నమ్మినవాళ్లను వాడుకొని వదిలేయటం మీకు అలవాటని కొండా సురేఖ 26.10.2013న ఆరోపించారు. మీరు లక్ష కోట్ల అవినీతిపరులని బహిరంగ లేఖ రాశారు. కేకే మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, రాజ్‌ ఠాకూర్‌ తదితరులు ఇలాంటి మాటలే అన్నారు. ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు?

194. తన సర్వీస్‌లో ఇంత భయంకరమైన దోపిడీ చూడలేడని సీబీఐ డైరెక్టర్‌ వ్యాఖ్యానించడం, ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని 14.9.2013న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?

195. మీ జైల్‌మేట్‌ విజయసాయిరెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించిందీ, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా సిఫార్సు చేసిందీ మీ తండ్రి. విజయసాయిని రిజర్వ్‌బ్యాంక్‌ డైరెక్టర్‌గానూ నియమింపచేసేందుకు మీ తండ్రి విశ్వప్రయత్నాలు చేయలేదా? ఆయనపై ఎందుకంత ప్రత్యేకాభిమానం?

196. నీకిది, నాకిది పార్ములా ప్రయోగించడం, పారిశ్రామికవేత్తలు జైళ్లు పాలుకావడం, అవినీతి, కుంభకోణాల వల్ల పారిశ్రామిక రంగం గతి తప్పడానికి వైఎస్‌ పాలన కారణం కాదా? వైఎస్‌ హయాంలో లక్షకోట్ల మేర పెట్టుబడులు, ప్రతిపాదనలు, వెనక్కి వెళ్లడానికి కారణాలేమిటి?

197. పరిశ్రమల కోసమంటూ దాదాపు 2 లక్షల ఎకరాల భూముల్ని నామమాత్రపు ధరలకు అయినవాళ్లకు ధారాదత్తం చేశారు. అమూల్యమైన భూములన్నింటిని పెద్దలంతా గద్దలా తన్నుకుపోయింది వైఎస్‌ పాలనలో కాదా?

198. ఏ ఒక్క అధికారికి అయినా ఫోన్‌ చేశానా, ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లానా అంటూ అమాయకత్వం అభినయిస్తున్న జగన్‌… రూ.43 వేల కోట్లు పోగేసుకున్నట్లు సీబీఐ మోపిన అభియోగాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

199. పారిశ్రామికాంధ్ర ప్రదేశ్ పేరుతొ కెవి రావు, కెవిపి, ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, గాలి జనార్ధన్ రెడ్డి, వై.ఎస్. సుదీకర్ రెడ్డి ..ఇలా సపరివారమంతటికీ 2 లక్షల ఎకరాలు కట్టబెట్టలేదా? ఇంతటి భూదోపిడీ ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా?

200. 2004 లో ప్రపంచ వ్యాప్తం గా పేరొందిన జర్మనీ సంస్థ వోక్స్ వాగన్ రాష్ట్రం లో రూ 1500 కోట్లతో కార్ల పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వచ్చింది. మీ అవినీతి వల్లనే ఆ పరిశ్రమ మహారాష్ట్ర కు తరలిపోవడం వాస్తవం కాదా?

201. వై.ఎస్ కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని 13 మంది ముఖ్య మంత్రులు పాలించారు, వారి కొడుకులలో ఎవరిపైనైనా ఈ విధమైన ఆరోపణలు వచ్చాయా? ప్రజాధనం దోపిడీ చేసారా?.

మ్యాల కిరణ్ కుమార్…

ప్రకాశం జిల్లా జనసేన

మరిన్ని వార్తలు:

నంద్యాల లో టీడీపీ కి బీజేపీ శల్యసారధ్యం ?

సొంత డబ్బా సరైన పనేనా..?

చైనాకు షాకిచ్చిన కేంద్రం