18 ఏళ్ల తర్వాత ఆ బ్యూటీతో చిరు కాంబో రిపీట్..ఎవరంటే..?

18 ఏళ్ల తర్వాత ఆ బ్యూటీతో చిరు కాంబో రిపీట్..ఎవరంటే..?
Cinema News

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్‌ సినిమా విశ్వంభర. చిరు 156వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ ను’బింబిసారా’ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచుతోంది చిత్రబృందం. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ లో మెగాస్టార్‌తో జత కట్టబోయే భామ ఎవరంటూ నెట్టింట తెగ చర్చ నడిచింది. ఒక దశలో అనుష్క శెట్టి నటిస్తుందని అంతా భావించారు.

కానీ చివరగా చెన్నై చిన్నది, ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిషన్ చిత్రబృందం ఎంపిక చేసింది. తాజాగా అధికారికంగా ప్రకటన కూడా చేసింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోమ‌వారం చిరంజీవి ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్మెంట్ చేశారు. త్రిష విశ్వంభ‌ర సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియో ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తేగా వైర‌ల్ అవుతోంది.

చిరంజీవి త్రిష గతంలో స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయం తెలుసుకుని అటు చిరు ఫ్యాన్స్, ఇటు త్రిష ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఇక ఇటీవలే విశ్వంభర రిలీజ్ డేట్‌ని కూడా చిత్రబృందం ఖరారు చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియచేసింది .