మహేష్‌కు క్షమాపణలు చెప్పిన కమెడియన్‌…!

Tamil Comedian Manoj Prabhakar Comments On Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుపై తమిళ కమెడియన్‌ మనోజ్‌ ప్రభాకరన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. మహేష్‌కు నటన సరిగా రాదని, స్పైడర్‌ చిత్రంలో మహేష్‌ కంటే ఎస్‌ జే సూర్య బాగా నటించాడు అంటూ మనోజ్‌ అన్నాడు. కత్రినా కైఫ్‌కు మగ రూపం ఈయన అంటూ మహేష్‌బాబుపై తీవ్ర స్థాయిలో కామెంట్స్‌ చేసిన మనోజ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భారీ ఎత్తున సోషల్‌ మీడియాలో మనోజ్‌పై మహేష్‌ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో మనోజ్‌ స్పందించాడు.

maheshbabu-tamil-comedian

తాను చేస్తున్న కామెడీ వీడియో సక్సెస్‌ అయ్యేందుకు, అందరి దృష్టిని ఆకర్షించేందుకు మహేష్‌పై అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప, ఆయనపై ఎలాంటి దురుద్దేశ్యం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడు కూడా మహేష్‌బాబును వ్యక్తిగతంగా దూషించాని భావించలేదని, అలా అనుకోను అని కూడా చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబు మరియు ఆయన అభిమానుల బాధపడితే క్షమించాలంటూ మనోజ్‌ ప్రభాకరన్‌ అన్నాడు. ఈయన చాలా రోజులుగా ఇలా కొంతమంది హీరోలపై కామెంట్స్‌ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మహేష్‌బాబు పై కాస్త సీరియస్‌గా కామెంట్స్‌ చేయడంతో దుమారం రేగింది. మహేష్‌ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

mahesh-babu