అరవింద సమేత వీర రాఘవ మూవీ ఫస్ట్ సాంగ్…

 

Aravindha Sametha Anaganaganaga Lyrical Video

జూ.ఎన్టీయార్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంతమంది ఫాన్స్ ఆనందపడి ఉంటారో. జూ.ఎన్టీయార్ తెలుగు స్వచ్ఛమయిన  ఉచ్ఛారణ, తెలుగు మీద తనకున్న పట్టు గురించి మనం కొత్తగా మాట్లడకునేది ఏమిలేదు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటల మాంత్రికుడు అని ప్రతీ తెలుగు వాడి చేత పిలిపించుకున్న రచయిత, తెలుగు పదాలతో తనదైన శైలిలో మాటలు బాణాలు సంధించగలవారు. ఇలాంటి ఈ తెలుగు వాడి తెలిసిన హీరో అండ్ దర్శకుడు కలిస్తే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా. తెలుగు భాష మురిసిపోయేలా, తెలుగు వాడు కేరింతలు కొట్టేలా సంభాషణలు ఉంటాయండంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఈ సినిమా టీజర్ ఏ స్థాయిలో ఆకట్టకుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మొదటి సారిగా తమన్ త్రివిక్రమ్ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ, తమన్ అండ్ తారక్ కి ఇది 5th సినిమా. ఇక హీరోయిన్స్ విషయంకి వస్తే, పూజా హెగ్డే అండ్ ఈషా రెబ్బ తారక్ కి జోడిగా నటిస్తున్నారు. అలాగే, సునీల్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.

ఇక ఈ పాట విషయానికి వస్తే, తమన్ మ్యూజిక్, ఆర్మాన్ మాలిక్ స్వరం, సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన అక్షరాలు, పాటని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే చెప్పాలి. అంతే కాకుండా, మాలిక్ ఫస్ట్ టైం తారక్ సాంగ్ ని పాడారు. ఇక చూసుకోండి…