రానాకు షాక్‌ ఇచ్చిన నెటిజన్స్‌…!

Rana Chit Chat On Social Media

యంగ్‌ హీరో రానా తాజాగా సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌ తో చిట్‌ చాట్‌కు సిద్దం అయ్యాడు. తనను ప్రశ్నడిగితే వాటికి సమాధానాలు చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు. రానా ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున రెస్పాన్స్‌ దక్కింది. రానాను వరుసగా ప్రశ్నతో ముంచెత్తారు. అయితే ఎక్కువ శాతం మంది రానా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. పెళ్లి గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న కారణంగా పెళ్లి గురించి ఇప్పుడు వద్దు అంటూ వారికి సమాధానం ఇచ్చాడు. అయినా కూడా పెళ్లి గురించే ఎక్కువ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో రానాకు చిరాకు ఎత్తింది.

RANA-BIOPIC-NTR

పెళ్లితో పాటు రానా తాజాగా ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో నటిస్తున్న విషయమై చాలా మంది ప్రశ్నలు అడిగారు. ఎక్కువ శాతం మంది చంద్రబాబు నాయుడు పాత్రను మీరు ఎలా పోషిస్తున్నారు. మీరు బాలకృష్ణకు వెన్ను పోటు పొడుస్తున్నారా అంటూ ప్రశ్నించారు. బాలయ్య వెన్నుపోటు విషయమై రానాను పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్న కారణంగా చేసేది లేక చాటింగ్‌ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిత్రంలో నటిస్తూ తప్పు చేస్తున్నావు అంటూ రానాను ఎంతో మంది హెచ్చరిస్తున్నారు. ఒక వెన్ను పోటు వ్యక్తి, ఒక విలన్‌ పాత్రలో నువ్వు నటిస్తున్నాను అంటూ రానాకు నెటిజన్స్‌ షాక్‌ ఇచ్చారు. మరీ ఇంత వ్యతిరేకత ఉంటుందని తాను భావించలేదని, ఇలాంటి అనుభవం ఎదురవుతుందని తాను ఊహించలేదు అంటూ రానా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.

rana-dhaggupTI