20 వసంతాల టీడీఎఫ్

20 వసంతాల టీడీఎఫ్

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం టీడీఎఫ్, యూఎస్‌ఏ 20వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. ఈసందర్బంగా జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకలను టీడీఎఫ్‌-యూఎస్‌ఏ జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకల కమిటీ నవంబర్‌ 8, 9 న రెండు రోజులు జరుపనున్నాయి.

కార్యక్రమంలో పాల్గొనేందుకు ‌జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకల కమిటీ నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సిందిగా సూచించారు.

కార్యక్రమాలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకి ప్రతీకగా ఏర్పాటు చేస్తూ అమెరికాలో నివసించే తెలంగాణ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరు అవబోతున్నారని సమాచారం.