నీయవ్వ తగ్గేదేలా.. మద్యపానంలో తెలంగాణే ఫస్ట్‌!

Telangana is first in drinking!
Telangana is first in drinking!

తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న, తొమ్మిదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాం. తలసరి ఆదాయంలో తెలంగాణనే ఫస్ట్‌… దేశ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా తక్కువ’ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మైక్‌ పట్టుకుంటే లెక్కలతో సహా చెప్పే మాటలు ఇవి. ఆ క్రెడిట్‌ అంత తమ బీఆర్‌ఎస్‌ పాలనలోనే సాధ్యం అయిందంటున్నారు. ఇవి నిజమే అనుకుందాం. కానీ మరో విషయంలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆ ఘనత కూడా బీఆర్‌ఎస్‌కే దక్కాలి . కానీ ఆ గొప్పదనాన్ని ఎప్పుడూ చెప్పుకోరు. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోరు. కానీ దేశంలో ఓ సంస్థ నిర్వహించిన తాగుబోతుల సర్వేలో అత్యధికంగా తెలంగాణ లో మద్యం తాగేది అని తేలింది. నంబర్‌ వన్‌ స్థానంలో మనేమే ఉన్నాం.

43.4 శాతం తాగుబోతులు..

తెలంగాణలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణ అత్యధికంగా 43.4 శాతం మంది మద్యం తాగుతున్నట్లు ప్రకటించింది. తర్వాత స్థానంలో 34.7 శాతంతో ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌ ఉన్నాయి. పంజాబ్‌ 22. 8 శాతం ఆ తర్వాతి స్థానంలో ఉంది.

తక్కువ తాగేది గుజరాత్‌లో..

ఇక గుజరాత్‌ అత్యంత తక్కువ మద్యం తాగే రాష్ట్రంగా సర్వేలో తేలింది. తర్వాత స్థానంలో జమ్ముకశ్మీర్‌ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో 5.8, 6 శాతం మద్యం తాగేవారి శాతంలో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 14.5 శాతం, బిహార్‌ 15 శాతం మంది మద్యం తాగుతారని సర్వే తేల్చింది.

తాగుబోతుల తెలంగాణ..

దేశంలో అత్యధికంగా మందుబాబులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. 43.4 శాతం మంది తాగుబోతులయ్యారు. కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణతోపాటు,రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా కూడా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇలా యువత తాగుడుకు బానిసవుతుంటే చదువులు అటకెక్కుతున్నాయి. ఉద్యోగాల ఆలోచన అడుగంటుతోంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కబ్జాలు పెరుగుతున్నాయి. వీటికి కారణం మద్యపానమే. ఎవరు అవునన్నా కాదన్నా.. నేరాల పెగురుదలకు తెలంగాణ మద్యం పాలసీనే పరోక్షంగా కారణం. అయినా ఆదాయం పెంచుకోవడం కోసం ,మరిన్ని మద్యం షాపులు పెంచడం, ఇంకా ఎక్కువ మద్యం అమకాలు చేయడంపైనే కేసీఆర్‌ ప్రభుత్వం దృష్టి పెడుతోంది.