ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల

telangana si exam results released

తెలంగాణ ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. 1272 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. సివిల్ 710, ఏఆర్ 275, టీఎస్‌ఎస్సీ 175, ఐటీఎస్సై 29, ఫింగర్ ఫ్రింట్ విభాగంలో 26 పోస్టులు భర్తీ అయ్యాయి. 992 మంది పురుషులు, 280 మంది మహిళలు ఎంపికయ్యారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.