టెనార్ జి2 స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..?

tenor announced the price of tenor g2 smart phone

టెనార్ కంపెనీ ఇటీవలే తన నూతన స్మార్ట్‌ఫోన్ టెనార్ జి2ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు చెందిన ధర వివరాలను ఆ కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. ఈ క్రమంలో టెనార్ జి2కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభ్యం కానుండగా.. 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,599 ధరకు లభ్యం కానుంది. ఈ రెండు వేరియెంట్లను ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయించనున్నారు.

టెనార్ జి2 స్మార్ట్‌ఫోన్‌లో 6.18 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.