బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న ధోని.. స్ప‌ష్టం చేసిన బీజేపీ లీడ‌ర్

ms dhoni entering into politics

ప్ర‌స్తుతం గ్రౌండ్‌లో సరికొత్త ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ధోని రానున్న రోజులలో రాజ‌కీయాల‌లో విలువైన‌ ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తాడ‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్ . తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. న‌రేంద్ర‌మోదీ టీంలో ధోని పొలిటిక‌ల్ ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యం ఆస‌న్నమైంద‌ని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ ప‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ త‌ర్వాత ధోని బీజేపిలో చేరేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ధోని ప్ర‌పంచ దిగ్గ‌జ ఆట‌గాడు. మంచి వికెట్ కీప‌ర్‌తో పాటు బ్యాట్స్‌మెన్‌గా అందరి ప్ర‌శంసలు అందుకున్నాడు. ఆయ‌న నాకు మంచి స్నేహితుడు. ధోని బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే విష‌యం గురించి పూర్తి స‌మాచారం ఆయ‌న రిటైర్మెంట్ తర్వాత తెలుస్తుంది అని పాశ్వాన్ వెల్ల‌డించారు. ఈ ఏడాది ధోని సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ ఈ స్కెచ్‌లు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగా ధోని మ‌రి కొద్ది రోజుల‌లో క్రికెట్‌కి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం. అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వెస్టిండీస్ సిరీస్‌కి ధోనిని ఎంపిక చేయ‌క‌పోవ‌చ్చ‌ని, ఆ త‌ర్వాత జ‌రిగే సిరీస్ ధోనికి చివ‌రిది అవుతుంద‌ని ప‌లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. చూడాలి మ‌రి భ‌విష్య‌త్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో..!