Sports: ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరో కాదండి…

Sports: Who is the greatest captain of IPL?
Sports: Who is the greatest captain of IPL?

ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు మాజీ క్రికెటర్లు ఆసక్తికర సమాధానమిచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్లను ప్రతిపాదించగా, మిస్టర్ కూల్ వైపే మాజీ క్రికెటర్లు మొగ్గు చూపారు. స్టార్ జ్యూరీ డేల్ స్టెయిన్, టామ్ మూడీ, హేడెన్, వసీం అక్రమ్ ఏకగ్రీవంగా ధోనీనే గ్రేటెస్ట్ కెప్టెన్గా తేల్చారు. వీరిద్దరి నాయకత్వంలో ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ చెరో 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే….. ఇటీవలే ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను స్టార్ స్పోర్ట్స్ పంచుకున్నా సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మీడియా ప్రతినిధులు 15 మంది ఆటగాళ్లతో పాటు కోచ్ను ఎంచుకున్నారు. ఆటగాళ్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లి, వార్నర్, క్రిస్ గేల్, MS ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, పొలార్డ్,డివిలియర్స్, సూర్యకుమార్, చాహల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, బుమ్రా ఉన్నారు. గ్రేటెస్ట్ కోచ్గా ఫ్లెమింగ్ ( చెన్నై సూపర్ కింగ్స్)నిలిచారు.