తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల

Telangana Teacher Eligibility Test (TET) Results released
Telangana Teacher Eligibility Test (TET) Results released

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి అని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీన జరిగిన టెట్ పేపర్ వన్‌కు 2 లక్షల 26 వేల 744 మంది.. పేపర్ 2కు లక్షా 89 వేల 963 మంది రాశారు. టెట్-2023 ఫలితాలు తెలుసుకోవాలంటే tstet.cgg.gov.in ఈ లింకును క్లిక్ చేయండి.

జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ వన్‌లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ టూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నవంబరు 20 నుంచి 30 వరకు జరగనుంది.