మీడియా కూడా శ్రీరెడ్డికి దూరంగా..!

Telugu Media avoids Sri Reddy after Pawan Kalyan issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్‌ కౌచ్‌పై యుద్దం ప్రకటించిన శ్రీరెడ్డికి మీడియా మరియు సినీ వర్గాలతో పాటు అన్ని వర్గాల నుండి మద్దతు లభించిన విషయం తెల్సిందే. పలు టీవీ ఛానెల్స్‌ వారు ఆమె ఇంటర్వ్యూ కోసం, ఆమె చర్చ కార్యక్రమాల కోసం వెంట పడ్డారు. కాని తాజాగా ఆమె పవన్‌ కళ్యాణ్‌పై చేసిన తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆమెను మీడియా కూడా బహిష్కరించింది. పలు న్యూస్‌ ఛానెల్స్‌ వారు ఇప్పటికే శ్రీరెడ్డిపై అనధికారికంగా బ్యాన్‌ విధించారు. తమ టీవీ కార్యక్రమాలకు మరియు చర్చ కార్యక్రమాలకు ఇకపై శ్రీరెడ్డిని పిలిచేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

శ్రీరెడ్డి తనకు తానుగా పవన్‌పై వ్యాఖ్యలు చేయడం వల్ల నాశనం చేసుకుందని, తనకు వచ్చిన గుర్తింపును ఆమె చేతులార చెడగొట్టుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియాలో పాపులారిటీ కోసం పవన్‌పై ఆమె అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రదర్శిస్తే, ఆమెతో చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా పబ్లిసిటీ కోసం మరింత అసభ్యంగా ఆమె మారిపోయే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఆమెను ఇకపై చర్చ కార్యక్రమాలకు పిలవద్దని నిర్ణయించుకున్నారు. ఇదే నిర్ణయాన్ని అన్ని టీవీ ఛానెల్స్‌ కూడా తీసుకోవాలని అంతా కోరుతున్నారు.