రోజా కి వాళ్ళని చూస్తే చెమటలు పడుతున్నాయి.

MLA roja fears with journalists

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజరికంలో యుద్ధం అంటే నిజంగా కత్తులతో పోరాడాల్సి ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ యుద్ధం అంటే కత్తుల్లాంటి మాటలతో, ఈటెల్లాంటి విమర్శలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం. ఈ విద్యలో ఆరితేరిన వైసీపీ నాయకురాలు రోజా కి మైక్ కనిపిస్తే చాలు యుద్ధం లోకి దిగిపోతారు. మైక్ పట్టుకున్న జర్నలిస్ట్ ని చూస్తే చాలు పూనకం వస్తుంది. ఇక ఏదైనా సభలో చేతిలో మైక్ రాగానే ఆమె విజృంభించేవారు. అయితే ఇదంతా రీసెంట్ హిస్టరీ. నంద్యాల, కాకినాడ ఎన్నికల ప్రచారంలో ఇలాగే నోరు పారేసుకున్న ఆమెకి ఫలితాలతో మైండ్ బ్లాక్ అయ్యిందట. జీర్ణం కాని రిజల్ట్ తో ఇబ్బంది పడుతున్న ఆమెతో మాట్లాడించడానికి కొన్నాళ్లుగా జర్నలిస్ట్ సోదరులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

గతంలో రోజాని చూసిన వారికి ఇప్పుడు ఆమె ధోరణి అర్ధం కావడం లేదట. ప్రెస్ తో మాట్లాడడానికి ఆమె ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపడం లేదట. వ్యక్తిగత సిబ్బందితో ఎవరైనా ప్రెస్ వాళ్ళు వస్తే లేరని చెప్పమని ముందే ఆర్డర్ పాస్ చేస్తున్నారట. ఇంతకుముందు ఎదురెళ్లి మాట్లాడిన ఆమె ఇప్పుడు జర్నలిస్టులు కనిపిస్తే చెమటలు కక్కుతున్నారట. ఇంతకీ ఆమె భయం ఏమిటంటే… నంద్యాల, కాకినాడ ప్రచారంలో అన్న మాటలు, వచ్చిన ఫలితం మీద ఏదైనా అడిగితే చెప్పడానికి సమాధానం ఏదీ లేకుండా పోవడమే. అయినా కాస్త ముందుగానే నోరు అదుపులో పెట్టుకుంటే ఇవాళ ఈ తిప్పలు తప్పేవిగా రోజమ్మా ! .

మరిన్ని వార్తలు:

కిమ్ పై ట్రంప్ కొత్త అస్త్రం

టి.టి.డి కొత్త చైర్మన్… ఎవరంటే ?

లండ‌న్ వెళ్ల‌నున్న జ‌గ‌న్‌… డిశ్చార్జి పిటిషన్ పై విచార‌ణ వాయిదా