వెంట పడుతున్న నిర్మాతలు

Telugu Producers are Trying For Movies With Priya Warrior

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ సాంగ్‌ ఇటీవల ఏ రేంజ్‌లో ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలోని హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తన కనుసైగలతో దేశ వ్యాప్తంగా ఉన్న కుర్రకారు గుండెలను బద్దలు కొట్టింది. పాటలో ప్రియా కన్ను కొట్టిన విధానం, ఆమె హావబావాలతో ఆడియన్స్‌కు పిచెక్కిపోతుంది. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న ప్రియా వారియర్‌ ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యింది. సౌత్‌లోనే కాకుండా ఈమెకు ఉత్తరాదిలో కూడా అద్బుతమైన రెస్పాన్స్‌ దక్కింది. ఈమెకు పలు భాషల్లో నటించే అవకాశం దక్కుతుంది.

ఒక తెలుగు సినిమా నిర్మాత ఈమె వద్దకు ఏకంగా 50 లక్షల అడ్వాన్స్‌ పట్టుకుని వెళ్లాడట. ఒక స్టార్‌ హీరోకు జోడీగా ఈమెను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళంలో ఆమె కమిట్‌ అయిన సినిమాలు పూర్తి అయిన తర్వాత తెలుగులో నటించేందుకు ఓకే చెప్పిందట. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రం కోసం ఆమె తీసుకున్న పారితోషికం కేవలం 15 లక్షలు. ఆ చిత్రంలోని పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏకంగా కోటి రూపాయల పారితోషికం రేంజ్‌కు వెళ్లింది. కోటి రూపాయలు అన్నా కూడా ఈమెతో నటించేందుకు హీరోలు, సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఈమెను తమ సినిమాల్లో నటించాలి అంటూ నిర్మాతలు వెంట పడుతున్నారు. తెలుగులో ఈమె మొదట నటించే సినిమా ఏంటో చూడాలి అంటే కాస్త ఆగాల్సిందే.