వాకాడ అప్పారావు కూడా అలాంటి వాడేనా ?

telugu film artists Allegations on producer Vakada Appa Rao

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి ప్రారంభించిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ముదిరి పాకాన పడుతోంది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఆ విషయంలో తనకు చాలా అన్యాయం జరిగిందంటూ శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు గతవారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగి ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ విషయాలను దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. దేశ వ్యాప్తంగా ఈ విషయం హైలైట్ అవ్వడంతో శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎత్తివేస్తూ నిన్న ప్రకటించింది.

అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి సాధించిన విజయం ఇదే క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడిన ఇతరులు కూడా ఈ వివాదంలో తమ గొంతు కలుపుతున్నారు. కేవలం గొంతు కలపడమే కాదు నేరుగా ఆయా వ్యక్తుల పేర్లను చెప్పేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిర్మాత వాకాడ అప్పారావును కామాంధుడిగా అభివర్ణిస్తూ పలువురు ఆరోపణలు చేశారు. ఖైదీ నంబర్ 150మూవీలో చిరంజీవి గారి సినిమాలో కనిపించేందుకు ఆరాటపడితే.. కమిట్మెంట్ అడిగాడని ఆరోపించారు. నిన్న ఓ ఛానెల్ లో జరిగిన లైవ్ ప్రోగ్రాం లో సదరు నిర్మాతకి కాల్ చేసిన ఛానెల్ ఆయన్ని లైవ్ లో ఉంచి కడిగి పారేశారు.

అలాగే ఆ లైవ్ లో పాల్గొన్న కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ స్క్రీన్ మీద హీరోలుగా వెలిగిపోతున్న చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. వీళ్లంతా ఆన్ స్క్రీన్ మాత్రమే హీరోలా.. వారికి ఈ విషయాలు తెలియవా.. తెలిసి కూడా ఊరుకుంటున్నారా అని వారు ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు కేవలం ఒక్క శ్రీ రెడ్డి తో ఈ వ్యవహారం ముగుస్తుంది అనుకున్న వారికి ఇంత పెద్ద ఎత్తున టాలీవుడ్ నుండి ఆర్టిస్ట్స్ రావడం అనేది మింగుడు పడడం లేదు. సురేష్ బాబు కొడుకు అభిరాం తో మొదలయిన ఈ లిస్టు ఇంకెంత మంది పెద్ద మనుషుల ముసుగు వేసుకున్న వారిని బయటకి లాక్కోస్తుందో అనే భయం ఇండస్ట్రీ అంతా నెలకొని ఉంది.

అంతే కాక చిరంజీవిని ఉద్దేశిస్తూ వాకాడ అప్పారావు వందలాది మంది మహిళా ఆర్టిస్టులను వేధించాడు. 16 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదు. మెగాస్టార్ చిరంజీవిగారు.. ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి’ అంటూ విజ్ఞప్తి చేస్తూ శ్రీరెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, తన ట్వీట్‌కు వాకాడ అప్పారావు ఫొటోను సైతం శ్రీరెడ్డి జత చేసింది.