ఫిదా చేస్తున్న తొలిప్రేమ కలెక్షన్స్‌

Varun Tej Tholiprema Movie Collections report

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ దూసుకు పోతున్నాడు. ‘ఫిదా’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్‌ తాజాగా ‘తొలిప్రేమ’తో క్లాసిక్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. పవన్‌ టైటిల్‌తో తెరకెక్కడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. సినిమాపై అందరిలో నమ్మకం మొదలైంది. అంచనాలను అందుకునేలా ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీతో, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి వెంకీ అట్లూరి సూపర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ‘ఫిదా’ చిత్రం కలెక్షన్స్‌ టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్‌ స్థాయిలోనే ‘తొలిప్రేమ’ కలెక్షన్స్‌ కూడా వస్తున్నాయి.

కేవం నాలుగు రోజుల్లో ‘తొలిప్రేమ’ ఏకంగా 15 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసి వావ్‌ అనిపించింది. వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2018లో మొదటి బిగ్‌ కమర్షియల్‌ సక్సెస్‌గా ఈ చిత్రం నిలిచింది. తొలిప్రేమ టైటిల్‌కు పూర్తి న్యాయం చేసే విధంగా ఈ చిత్రం ఉందనే టాక్‌ వినిపస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంది. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రం మిలియన్‌ మార్క్‌ దిశగా దూసుకు పోతుంది. లాంగ్‌రన్‌లో ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్స్‌ను సాధించడం ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది.