TG Politics: సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించిన హరీష్ రావు లేఖ..!

TG Politics: Harish Rao's letter warning CM Revanth Reddy..!
TG Politics: Harish Rao's letter warning CM Revanth Reddy..!

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టెట్ ఫీజులు భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది. టెట్ ఫీజులు తగ్గించాలి లేకుంటే నిరుద్యోగుల తరుపున పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ.. లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, టెట్ ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు.

ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్ గా ఉండటం గమనార్హం అన్నారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నామని హరీష్‌ రావు పేర్కొన్నారు.