ఆ యంగ్ హీరో ఆన్‌లైన్‌ పియానో పాట్లు…

కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఎంతటి వారినైనా ఇంట్లోనే కూర్చోపెడుతుంది. ముఖ్యంగా లాక్‌డౌన్ తో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ళ‌కే పరిమిత‌మ‌య్యారు. ఈ ఖాళీ స‌మ‌యాన్ని కొంద‌రు చాలా చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే స‌మంత ఆన్‌లైన్‌లో యాక్టింగ్‌తో పాటు వ‌ర్కవుట్స్ కూడా నేర్చుకుంటుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌ట‌న‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో శిక్ష‌ణ తీసుకుంటుంది. త‌మిళంలో కూడా ప‌ట్టుసాధించేస్తుంది. అలాంటి ప్ర‌య‌త్నాలే ముమ్మరంగా చేస్తుంది.

అయితే తాజాగా యంగ్ హీరో సుశాంత్ ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ కీబోర్డ్ పియానో వాయించు కున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఎల్ల‌ప్పుడు ఏదో ఒక ప‌రిక‌రాన్ని ప్లే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే.. నాకు శుభాకంక్ష‌లు చెప్పండి అంటూ సుశాంత్ ట్వీట్ చేశాడు. కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సినిమాలలో హీరోగా నటించిన సుశాంత్ అలవైకుంఠపురంలో సినిమాలో రాజ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే సినిమాలో సుశాంత్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.