వైసీపీ నేతలకు ధైర్యం/ భయం రెండు ఆ ఒక్కరే.?

AP Cabinet meeting concluded.. Discussion on many important issues
AP Cabinet meeting concluded.. Discussion on many important issues

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీల వారిని కాకుండా సొంత పార్టీ నేతలలో కూడా భయాన్ని కలిగిస్తుంది. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే జగన్ ఎమ్మెల్యేలను ప్రజల ముందు ఇరుకున పడేస్తున్నాయి.

నిమ్మగడ్డ రమేష్ తో వివాదం, మూడు రాజధానులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ , జస్టిస్ ఎన్వీ రమణ గురించి లేఖ, ఇలా జగన్ తీసుకున్నా ప్రతి నిర్ణయం రిస్క్ తో కూడుకున్నవే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఎమ్మెల్యేలలో వణుకు పుట్టిస్తున్నాయి.జగన్ తన పరిపాలన నాలుగున్నర సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. జగన్ నమ్ముకున్నది వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలనే. జగన్ నమ్ముకున్నది పార్టీ నేతలని కాదు..గెలిచిన ఎమ్మెల్యేలను కాదు, ప్రజలు, మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేది సంక్షేమ పథకాలు అని జగన్ నమ్ముతున్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలలో భయం ఉన్న,జగన్ ఉన్నారని ధైర్యంతో ఉన్నారు. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ కృషి చేస్తారని, ఏమి చేసినా ఎలా చేసినా కచ్చితంగా జగన్ మళ్ళీ వైసీపీనీ అధికారంలోకి తీసుకువస్తారని నమ్మకంతో వైసిపి ఎమ్మెల్యేలు, క్యాడర్ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయడం జగన్ నైజం. వైసిపి నేతలను కొందరికి ఓటమి భయం ఉన్నా జగన్ అనే ధైర్యం వారిని నడిపిస్తుందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.