రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..!

Arogyashri services suspended in AP from tomorrow..!
Arogyashri services suspended in AP from tomorrow..!

ఏపీ ప్రజలకి అలర్ట్. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (మే 22వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకి అందించిన చికిత్స బిల్లులని ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపారు . వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉందని చెప్పారు .

Arogyashri services suspended in AP from tomorrow..!
Arogyashri services suspended in AP from tomorrow..!

రూ.530 కోట్ల విలువైన బిల్లులని సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఈ నెల 2వ తేదీన సీఈఓ చెప్పారని కానీ ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు వెల్లడించారు . ఉద్యోగుల ఆరోగ్య శ్రీ పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయని తెలిపారు . ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని ఆశా వాళ్ళు పేర్కొన్నారు .