“ఫ్యామిలీ స్టార్” రెండో సాంగ్ కు డేట్ ఫిక్స్…!

The date for the second song of
The date for the second song of "Family Star" is fixed

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా హిట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా “ఫ్యామిలీ స్టార్” కోసం అందరికీ తెలిసిందే. మూవీ ఫస్ట్ సింగిల్ అలాగే టీజర్ లకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ నుంచి రెండో సాంగ్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే మేకర్స్ దీనిపై కూడా అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసింది.

The date for the second song of "Family Star" is fixed
The date for the second song of “Family Star” is fixed

అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనిపై వారు ఒక అప్డేట్ అందించారు. మరి ఈ సాంగ్ ను అయితే ఈ మార్చ్ 12న రిలీజ్ చేస్తున్నట్టుగా మృణాల్, విజయ్ దేవరకొండ లపై బ్యూటిఫుల్ పోస్టర్ తో ‘కళ్యాణి వచ్చా వచ్చా’ అంటూ అనౌన్స్ చేశారు. ఇక దీనికి టైం ఇంకా లాక్ అవ్వాల్సి ఉంది. అలాగే ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ కాబోతుంది.