జాబిల్లిపైన విజయం అంత ఈజీగా చిక్కలేదు..అన్ని దేశాలదీ విఫల చరిత్రే…

The victory over Jabilli was not so easy..all countries have a history of failure
The victory over Jabilli was not so easy..all countries have a history of failure

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమనౌకను పంపిన దేశాల సరసన భారత్‌ కూడా వచ్చి చేరింది. ఇప్పటివరకూ అమెరికా, చైనా దేశాలు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాయి. అయితే ఏ వ్యోమనౌక ప్రయాణించని చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 బుధవారం విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయింది. అయితే ఆయా దేశాలు చేపట్టిన మిషన్లన్నీ తమ మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కాలేదు.
ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌ తన ఆరో అంతరిక్ష యాత్రలో మాత్రమే చంద్రుడిని చేరుకోగలిగింది. సోవియట్‌ యూనియన్‌కు చెందిన లూనా-2 మిషన్‌ 1959 సెప్టెంబరు 14న చంద్రుడిపై కూలిపోయింది. మరో ఖగోళ వస్తువును తాకిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్రలో నిలిచిపోయింది. అమెరికాకు చెందిన నాసా సైతం చంద్రయాత్రల్లో 13సార్లు విఫలమైన తర్వాత 1964 జూలై 31న తొలి విజయాన్ని నమోదు చేసింది.చంద్రుడి ఉపరితలంపై నానాకు చెందిన రేంజర్‌-7 కూలిపోయే ముందు 4,316 చిత్రాలను పంపడం కీలక మలుపుగా నిలిచింది.

చంద్రుడిపైకి ఆర్బిటర్‌ మిషన్లను ప్రారంభించిన చైనా..

జాబిల్లి ఉపరితలంపై చాంగే ప్రాజెక్టు సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి వీలుగా చైనా వివరణాత్మక పటాలను రూపొందించింది. చాంగే-3 డిసెంబరు 2న 2013లో,చాంగే-4 డిసెంబరు 7న 2018లో ప్రయోగించిన మిషన్లు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి రోవర్లతో ఉపరితలాన్ని అన్వేషించాయి. చాంగే-5 నవంబరు 23న 2020లో వెళ్లిన .. చంద్రుడిపై నుంచి 2 కేజీల మట్టి నమూనాలతో తిరిగొచ్చింది.

లూనార్‌ మిషన్‌ చంద్రయాన్‌-1 2008 అక్టోబరు 22న మన దేశంలో మొదటిసరిగా మొదలైంది. అప్పట్లో వ్యోమనౌకను చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ వ్యోమనౌక జాబిల్లి చుట్టూ 3,400సార్లు కక్ష్యలో పరిభ్రమించింది. 2019 జూలై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించగా.. సాఫ్ట్‌వేర్‌ లోపాలతో అదే ఏడాది సెప్టెంబరు 6న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై కూలిపోయింది.

మైనస్‌ 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో..

భూమ్మీద ఒక పగలు 12 గంటలు. కానీ, చంద్రుడి మీద 14 రోజులు. అంటే 14 రోజులు పూర్తిగా వెలుగు. తర్వాత చీకటి. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై పడే సూర్యరశ్మితో సోలార్‌ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొంది పనిచేస్తుంది. ఆగిపోయాక ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు చీకటి నెలకొని చంద్రుడిపై పడిపోతుంది. ఈ వ్యవధిలో మనుగడ కష్టమే. అయితే, విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ సూర్యరశ్మి 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక కాంతి పడి తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది.