ఇన్‌స్టాలో పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్‌గా మారిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

pawan kalyan Latest News About His Insta
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే ప్రతి ఒక్క అభిమానికి తెలియని ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది . ఆయనకు ఉన్నఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆయన అభిమానులు థియేటర్ల ముందు,సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు .ఆ విధంగా పాపులారిటీ సంపాదించుకున్న ఆయనకు ఒక్క సామాన్య ప్రేక్షకులే కాదు ప్రముఖ సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు.ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు జూలై 4వ తేదీన తన ఇన్‌స్టా ఖాతా లో ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ ఒక బయో ఓపెన్ చేశారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాతాను ఆయనPR టీమ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు. ప్రస్తుతానికి ఆయనని అనుసరిస్తున్న వారి సంఖ్య సుమారుగా 2.3 మిలియన్లకు పైగానే చేరింది .ఒకవేళ ఆయన మొదటి పోస్ట్ పెడితే ఈ ఫాలోవర్స్ సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా కొందరు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను ఇన్స్టా లో ఫాలో అవుతున్నారు. అందులో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం విశేషం. శృతిహాసన్, కీర్తి సురేష్ ల తో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఆయనను ఇన్స్టా గ్రామ్ లో అనుసరిస్తూ ఉండడం గమనార్హం. రాబోయే కాలంలో మరింత సినీ ప్రముఖులు ఆయనను అనుసరిస్తారని ఆశిద్దాము ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన ‘ బ్రో ‘చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు,