బాక్స్ ఆఫీసు క బాద్ షా “ప్రాజెక్ట్ కే”…

Prabhas Latest Movie project k
project k

పాన్ ఇండియన్ రెబెల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాగా రోజు రోజు కు దిమ్మ తిరిగే అప్ డేట్స్ వస్తున్నాయి . ప్రాజెక్ట్ కె రెండు భాగాలుగా తెరక్కిస్తున్నట్టు నిర్మాతలు డిసైడ్ చేసారు.ప్రాజెక్ట్ కె మొదలు పెట్టక ముందు అనుకున్న బడ్జెట్ వేరు సినిమా తీసేకొద్దీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుండటంతో సినిమాని రెండు పార్టులుగా తీయ్యవలసి వచ్చింది . కథనం ప్రకారం 500 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఇదే బడ్జెట్లో తీస్తే నిర్మాతలకి నష్టం వచ్చే అవకాశం ఉందని భావించి, కాస్త బడ్జెట్ పెంచి రెండు పార్టీలుగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు ఇక కథ పరంగా పార్ట్ 1 లో కేవలం పాత్రల పరిచయంతో కథలోకి వెళ్లాడటం జరుగుతుందని అన్నారు . పార్టు 2 లో సినిమా లీడ్ గా పార్ట్ 1 ఎండింగ్ ఉంటుందని సమాచారం . లోకనాయకుడు కమల్ హాసన్ చివరి లో ఎంట్రీ ఇస్తాడని . కమల్ ఎంట్రీ తో రెండో పార్ట్ కమల్ మీదే అంత ఉంటుందన్న ఫీలింగ్ తో సినిమాను ముగించేలా ఉంటుందని సినీ విశ్లేషకుల మాట . బడ్జెట్ వలన ప్రాజెక్ట్ కె రెండు పార్టీలుగా రాబోతుందని తెలుస్తుంది . ఈ సినిమాలో హాలీవుడ్ స్టూడియోలను కూడా నిర్మాణ భాగస్వాములుగా చేస్తున్నారు .