అనుష్కని కోడలుగా చేసుకోవాలనుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా?

Anushka
Anushka

అందాల భామ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నాగార్జన సరసన సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన అరుంధతి సినిమాతో విపరీతమైన స్టార్‌డమ్ సంపాదించింది.ఇక బాహుబలి తర్వాత ఆమె స్టార్‌డమ్ పెరిగినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపించనుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా అనుష్క ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు అయితే ప్రచారం అయ్యాయి.ప్రస్తుతం అనుష్క గురించి మరో కొత్త వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య వ్యక్తం చేస్తారు. గతంలో దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు అనుష్కని తన ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారట.మా కుమారుడు ప్రకాష్ ని పెళ్లి చేసుకుంటావా అని అనుష్కా అని అడిగితే ఆమె సున్నితంగా తిరస్కరించిందట గతంలో తన కుమారుడు ప్రకాష్ కు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు కే . రాఘవేంద్రరావు గారు అనుష్కని ఆయన ఫస్ట్ ఛాయిస్ అనుకున్నారట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేనట్లు అనుష్క రాఘవేంద్రరావుతో చెప్పిందట.అయన కుమారుడు ప్రకాష్ 2014లో ముంబైకి చెందిన కనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2017 లో మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడగాలని కే . రాఘవేంద్రరావు భావించాడట.తన కొడుకుని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా కానీ అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్నారు. అనే సందేహంతో కే .రాఘవేంద్ర రావు ఆగిపోయారట.