టైగర్ 3: వసూళ్ల జోష్ తగ్గిందా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3 సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. ఈ సినిమా నిన్న 20.50 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది గత మూడు రోజులతో పోల్చితే తక్కువే అని చెప్పుకోవాలి. వీక్ డేస్ రోజు స్ట్రాంగ్ హోల్డ్ ఉండి ఉంటే ఇంకో 15 నుండి 20 కోట్ల వసూళ్లు రాబట్టేది. ఈ మూవీ ఇప్పటి వరకూ 165 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

టైగర్ 3: వసూళ్ల జోష్ తగ్గిందా?
Tiger-3

తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా మూవీ మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ రెండు బాషల్లో 4.75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.