మొదటిరోజు కంటే గట్టిగా “టైగర్ నాగేశ్వరరావు” రెస్పాన్స్.!

మొదటిరోజు కంటే గట్టిగా “టైగర్ నాగేశ్వరరావు” రెస్పాన్స్.!
Cinema News

మాస్ మహారాజ రవితేజ హీరోగా నుపుర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్స్ గా దర్శకుడు వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “టైగర్ నాగేశ్వరరావు”. మరి రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అండ్ మొట్ట మొదటి కంప్లీట్ పాన్ ఇండియా మూవీ గా ఇది రాగ తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా కి దక్కాయి. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయితే దసరా రేస్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

మొదటిరోజు కంటే గట్టిగా “టైగర్ నాగేశ్వరరావు” రెస్పాన్స్.!
Tiger Nageswarao

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఈ 5,6వ రోజు రెస్పాన్స్ గట్టిగా వచ్చింది అని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ సహా కన్నడలో కూడా అన్నట్టుగా తెలుస్తోంది . అలాగే ఈ డే 5,6 కి బుక్ మై షో లో టైగర్ నాగేశ్వరరావు భారీ జంప్ ని ఈ సినిమా రిజిస్టర్ చేయడం విశేషం. మరి ఇదే కానీ కంటిన్యూ అయితే రవితేజ కెరీర్ లోనే ఒక గుర్తుండిపోయే హిట్ గా ఇది నిలుస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు.