చంద్రబాబుకి కాలం కలిసివస్తోంది..!

chandrababu
chandrababu

సంక్షోభాలను సవాళ్లను అధిగమించగల నాయకుడు చంద్రబాబు. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతికూలతలు కాస్తా.. అనుకూలంగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాలం కలిసి వస్తోంది. దూరమైన వర్గాలన్నీ దరిచేరుతున్నాయి. శత్రువులు, ప్రత్యర్ధులు సన్నిహితులుగా మారుతున్నారు. కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో టిడిపి ఘోర వైఫల్యం చెందింది. దారుణ ఓటమిని మూటగట్టుకుంది. పని గట్టుకొని చంద్రబాబును ఓడించిన పరిస్థితి ఎదురైంది. అన్ని వర్గాలు జగన్కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఒక్కొక్కరూ జగన్కు దూరమవుతున్నారు. చంద్రబాబుకు దగ్గరవుతున్నారు. పరిస్థితులు మొత్తం అనుకూలంగా మారిపోతున్నాయి.

చంద్రబాబుపై కోపంతో జగన్ కు అంతులేని సహకారాన్ని అందించింది. అటు జనసేన సైతం ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కలిసి నడిచేందుకు జనసేన సిద్ధంగా ఉంది. గతం మాదిరిగా బిజెపి వ్యతిరేకంగా లేదు.

అటు సినిమా రంగం సైతం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది. ఎన్నికల ముందు కొందరు ఆ పార్టీలో చేరారు. కీలక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఒక్క నందమూరి వంశమే టిడిపికి పరిమితమైంది.ఇప్పటికే చాలామంది ఎన్నారైలు ఎన్నికలకు ఫండింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇలా ఎటువైపు చూసినా చంద్రబాబుకు అనుకూలమైన వాతావరణమే నడుస్తోంద