“పుష్ప 2 ది రూల్” అనుకున్న టైం కే!

“పుష్ప 2 ది రూల్” అనుకున్న టైం కే!
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడనుంది అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ వచ్చింది. అనుకున్న డేట్ కే (ఆగస్ట్ 15, 2024) న మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

“పుష్ప 2 ది రూల్” అనుకున్న టైం కే!
Pushpa-2 the Rule

రోహిత్ శెట్టి, భారీ మల్టీస్టారర్ అయిన సింగం ఎగైన్ కూడా ఆగస్ట్ 15న విడుదల కానున్నది . ఈ మూవీ లో అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప 2 ది రూల్ సోలోగా విడుదల అవుతుందా? సింగం ఎగైన్ నిర్మాతలు విడుదల తేదీని మారుస్తారా? లేకపోతే అల్లు అర్జున్ మూవీ తో క్లాష్ కి రెడీ అవుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి. క్లాష్ జరిగితే మాత్రం రెండు మూవీ ల థియేట్రికల్ వసూళ్ల పైనా ప్రభావం పడుతుంది.