2017 ఆరంభం, అంతం మెగా ఫ్యామిలీతోనే..!

Tollywood 2017 Movies Starts and end with Mega Heros

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాలగమనంలో 2017 కూడా కలిసి పోబోతుంది. మరి కొన్ని గంటల్లో 2017 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఎన్నో అంచనాల మద్య మొదలైన 2017వ సంవత్సరం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సాగింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు మిశ్రమ స్పందన దక్కింది. 2017వ సంవత్సరంను సంక్రాంతి సీజన్‌తో చిరంజీవి, బాలకృష్ణ, శర్వానంద్‌లు ‘ఖైదీ నెం.150’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘శతమానంభవతి’ చిత్రాలతో ప్రారంభించారు. ఆ సినిమాలు మూడు కూడా మంచి విజయాలను దక్కించుకున్న నేపథ్యంలో 2017 మొత్తం పుర్తి సక్సెస్‌లతో నిండిపోవడం ఖాయం అని అంతా భావించారు. అయితే ఆ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో పాటు మరికొన్ని సినిమాలు యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్నాయి. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా టాలీవుడ్‌లో కొన్ని విషాదకర సంఘటనలు జరిగాయి. 

2017వ సంవత్సరంను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించగా ఈ సంవత్సరంను మెగా హీరో అల్లు శిరీష్‌ తన ‘ఒక్క క్షణం’ మూవీతో ముగించేశాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘ఒక్క క్షణం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉన్న ‘ఒక్క క్షణం’ చిత్రంతో 2017వ సంవత్సరం ముగియబోతుంది. ‘ఒక్క క్షణం’ తర్వాత సునీల్‌ హీరోగా నటించిన ఎన్‌ శంకర్‌ చిత్రం ‘2 కంట్రీస్‌’ విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చింది. 2017వ చిత్రం సునీల్‌కు చేదు జ్ఞాపకంగా ముగిసింది. 2018 సంవత్సరం మెగా మూవీ ‘అజ్ఞాతవాసి’తో మొదలు కాబోతుంది. టాలీవుడ్‌లో వచ్చే సంవత్సరం అయినా మంచి సక్సెస్‌లు దక్కుతాయో చూడాలి.

2017 ఆరంభం, అంతం మెగా ఫ్యామిలీతోనే..! - Telugu Bullet