మెట్రో ప్ర‌యాణంతో ఒక్క‌టైన జంట‌

delayed traffic groom takes kochi metro his wedding

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేర‌ళ రాష్ట్రం. తేదీ డిసెంబ‌ర్ 23,2017. ఎర్నాకులంలో ఉద‌యం 11 గంట‌ల‌కు రంజిత్ కుమార్ అనే వ్య‌క్తికి ధ‌న్య‌తో వివాహం జ‌రగాల్సి ఉంది. రంజిత్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల‌క్క‌డ్ నుంచి పెళ్లిమండ‌పానికి కారులో బ‌య‌లుదేరాడు. పాల‌క్క‌డ్ నుంచి ఎర్నాకులం 130 కిలోమీట‌ర్లు. వంద కిలోమీట‌ర్ల ప్ర‌యాణం సాఫీగానే సాగింది. అలువా వ‌ద్ద‌కు రాగానే అక్క‌డ భారీ ట్రాఫిక్ జామ్. అంతే పెళ్లివారు అక్క‌డ చిక్కుకుపోయారు.

kochi-metro

ఎర్నాకులం వెళ్ల‌డానికి ఇంకా 30 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాలి. ట్రాఫిక్ క్లియ‌ర్ అవ్వ‌డం లేదు. ఏం చేయాలో అర్ధంకాక వ‌రుడితో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు. ఆ స‌మ‌యంలో ఒక‌రు ఓ అద్భుత స‌ల‌హా ఇచ్చారు. కారు ప్రయాణం మానేసి మెట్రో రైలు ఎక్కాల‌న్న‌ది ఆ స‌ల‌హా. వ‌రుడి కుటుంబం త‌క్ష‌ణ‌మే ఆ స‌ల‌హా పాటించింది. హుటాహుటిన అలువా మెట్రోస్టేష‌న్ కు వ‌రుడు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌రుగులు తీశారు. కానీ వారికి అక్కడా నిరాశే ఎదుర‌యింది. టికెట్ల కోసం పేద్ద క్యూ. ఆ లైన్ లో నిల్చుని టికెట్ తీసుకుని మెట్రో ఎక్కేస‌రికి పెళ్లి స‌మ‌యం మించే పోతుంది. దీంతో వ‌రుడు అధికారుల వ‌ద్ద‌కు వెళ్లి అస‌లు విష‌యం చెప్పాడు.

Groom dumps car and takes Kochi Metro to reach wedding venue on time

త‌న పెళ్లి ఉంద‌ని, ముహూర్త స‌మ‌యం మించిపోతుందని ఆందోళ‌న వ్యక్తంచేశాడు. రంజిత్ అవ‌స‌రం గుర్తించిన మెట్రో అధికారులు మరొక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా..ఆయ‌న‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు మెట్రోటికెట్లు అందించారు. వారంతా మెట్రోలో ప్ర‌యాణించి ముహూర్త స‌మ‌యానిక‌ల్లా క‌ళ్యాణ‌మండ‌పం చేరుకున్నారు. బంధుమిత్రులు కోలాహ‌లం మ‌ధ్య రంజిత్ కుమార్, ధ‌న్య ఒక్క‌టయ్యారు. ఈ సంద‌ర్భంగా మెట్రో వ‌ల్లే త‌మ పెళ్లి జ‌రిగిందంటూ..వ‌ధూవ‌రులు కృత‌జ్ఞ‌త‌లు చెప్తున్న వీడియో ఇప్పుడు నెట్ లో వైర‌ల్ గా మారింది. కొచ్చిమెట్రో త‌న ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేసింది. త‌మ వ‌ల్లే ఓ జంట పెళ్లి ఎలాంటి అడ్డంకులూ లేకుండా జ‌రిగింద‌ని పేర్కొంది. అంతేగాక మెట్రో సిబ్బంది నూత‌న వ‌ధూవ‌రుల‌కు కోచి వ‌న్ కార్డును పెళ్లి కానుక‌గా అందించారు. ఈ కార్డుతో రంజిత్ కుమార్, ధ‌న్య‌కు మెట్రోలో ప్ర‌త్యేక ప్ర‌వేశం ఉంటుంద‌ని తెలిపారు. మొత్తానికి వివిధ రాష్ట్రాలు ట్రాఫిక్ కు ప్ర‌త్యామ్నాయంగా భావిస్తున్న మెట్రోవ‌ల్ల అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరుతోంద‌ని ఈ ఘ‌ట‌న చూస్తే అర్ధ‌మ‌వుతోంది. కొచ్చి మెట్రోను ఈ ఏడాది జూన్ లో ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు.