ఈ ఏడాది పెళ్లిపీటలెక్కబోయే టాలీవుడ్ బ్యూటీస్ !

ఈ ఏడాది పెళ్లిపీటలెక్కబోయే టాలీవుడ్ బ్యూటీస్ !
Cinema News

గతేడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలో చాలా మంది హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాదిలోనూ పలువురు సినీ తారలు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది రిలేషన్షిప్లో ఉండగా ఈ ఏడాదిలో సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా మందే పెళ్లి పీటలెక్కారు. కొత్త ఏడాదిలో ఆ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, తమన్నా భాటియా, అదితిరావు హైదరీ తదితరులు కూడా ఉన్నారు. వీళ్లతోపాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

రకుల్ ప్రీతీసింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. తాజాగా ఈ జంట పెళ్లికి ముహూర్తం కుదిరినట్టు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తమన్నా కూడా రకుల్ బాటలోనే బీ టౌన్ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉంది. వీళ్లు కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారంట . అదితిరావు హైదరీ కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్లు కూడా ఈ సంవత్సరం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంయుక్త మీనన్ కూడా పెళ్లి ఏర్పాట్లలో ఉండటంతోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనేది టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ భామల్లో ఈ ఏడాది ఎవరు పెళ్లి బంధంతో ఒక్కటవుతారో అనేది చూడాలి.