టాలీవుడ్‌ మొత్తం దర్శకుడి వెంటే!

tollywood top heros praising sukumar darshakudu movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. కొన్ని విమర్శకుల ప్రశంసలు పొందాయి. సుకుమార్‌ దర్శకుడిగా ఫుల్‌ సక్సెస్‌ అయ్యాడు. అదే జోష్‌తో నిర్మాతగా కూడా మారాడు. తన వద్ద ఉన్న కథలను చిన్న బడ్జెట్‌తో కొత్త వారిని తీసుకుని వేరే దర్శకుడి దర్శకత్వంలో నిర్మిస్తూ వస్తున్నాడు. సుకుమార్‌ నిర్మించిన మొదటి చిత్రం ‘కుమారి 21 ఎఫ్‌’. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాత సుకుమార్‌కు మంచి లాభాలనే తీసుకు వచ్చింది. ఇక సుకుమార్‌ తాజాగా ‘దర్శకుడు’ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

‘దర్శకుడు’ ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి కూడా సుకుమార్‌ తనకున్న పేరును పలుకుబడిని ఉపయోగించి యమ పబ్లిసిటీ చేస్తున్నాడు. మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, సమంత, చిరంజీవి ఇలా పలువురు టాలీవుడ్‌ స్టార్‌ అంతా కూడా సుకుమార్‌ నిర్మించిన ‘దర్శకుడు’ చిత్రానికి అండగా నిలిచి, ఈ సినిమాను ప్రశంసించారు. సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటూ నిర్మాత సుకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దర్శకుడు’ చిత్రం ఎలా ఉంటుంది అనేది చూడాలి. టాలీవుడ్‌ మొత్తం ‘దర్శకుడు’ వెనుక ఉండి ప్రమోట్‌ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

రానా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’