మహాత్ముడికి ఘన నివాళులు

మహాత్ముడికి ఘన నివాళులు

నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి. అహింసే ఆయుధంగా దేశం కోసం, ధర్మం కోసం శాంతి కోసం పోరాడిన బాపూజీ జీవన మార్గం ప్రతీ భారతీయుడికి అనుసరణీయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకం.

గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. ఆయనతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్‌ షా గాంధీజీకి నివాళులు అర్పించారు.