త్రిష మోహిని మూవీ – రిలీజ్ డేట్

నటీ నటులు : త్రిష , జాకీ భగ్నానీ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆర్.బి.గురుదేవ్
మ్యూజిక్ : వివేక్ మెర్విన్
ఎడిటింగ్ : దినేష్ పోన్రాజ్
రచన – దర్శకత్వం : రమణ మాదేష్

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది త్రిష. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేసింది అదే ‘మోహిని’. త్రిష ముఖ్య పాత్రలో దర్శకుడు మాదేష్‌ రూపొందించిన హారర్‌ చిత్రం ‘మోహిని’. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్, శ్రీనివాస్‌ రావు పల్లెల, కరణం మధులత ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి క్రేజ్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విజువల్ గ్రాండియర్‌గా హారర్ బ్యూటీతో అందరినీ అలరిస్తుంది.

హారర్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు పోషించని డిఫరెంట్ క్యారెక్టర్ లో త్రిష కనిపించబోతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని లండన్ లో షూట్ చేశారు. మూవీలో త్రిషతో పాటు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ నటించాడు. రమణ మాదేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది త్రిష.