ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ కసరత్తు ఇలా…

Trivikram Srinivas change NTR movie Script and Dialogues

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అజ్ఞాతవాసి దెబ్బకు చాలా లెక్కలు మారిపోతున్నాయి. ఎన్టీఆర్ సినిమా మీద డైరక్టర్ త్రివిక్రమ్ కసరత్తు ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఏకంగా తన దగ్గర దర్శకత్వ శాఖనే శుద్ది చేసేస్తున్నారు. స్క్రిప్ట్, షూటింగ్ దశలో ఏ ఒక్కరు కూడా చూచాయగా అయినా సబ్జెక్టు, సీన్స్ మీద ఒక్కసారి అయినా అభ్యంతరం లేవదీయకపోవడాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఓ ఒరవడికి అలవాటు పడి బండి నడిపిస్తున్న వారిని వదిలించుకోడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఓ పక్క ఈ చద్ది మూటని పక్కనబెట్టడంతో పాటు కొత్త కొత్త ఆలోచనలతో వచ్చే కుర్రకారుని తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోకి తీసుకోవాలని కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ కుర్రోళ్ళు ఎన్టీఆర్ సినిమాకే రంగంలోకి దిగుతారంట.

అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మూల కధలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నారట. అంతకన్నా లోతు అయిన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ సినిమా కోసం యద్దనపూడి సులోచనారాణి నుంచి ఓ నవల హక్కులు కొనుగోలు చేసినట్టు కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. ఆ నవల ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ కసరత్తు చేస్తున్నారు.