ఒబామా ఓ దద్దమ్మ : ట్రంప్

అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాజీ అమెరికా అధ్యక్ష్యుడు ఒబామాపై తిట్ల దండకం గట్టిగా విసిరాడు. తాజాగా అమెరికా అధ్యక్ష్య నివాసం వైట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. మాజీ అమెరికా అధ్యక్ష్యుడు బరాక్‌ ఒబామా ఓ0 అసమర్థ అధ్యక్ష్యుడని దుయ్యబట్టారు. అందుకు కారణం శనివారం ఒబామా ఓ కార్యక్రమంలో కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వ తీరును పట్ల అసహనం వ్యక్తం చేయడమే.
అయితే ఓ కాలేజి గ్రాడ్యుయేట్లతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న ఒబామా కరోనా మహమ్మారి అమెరికా నాయకత్వాన్ని బహిర్గతం చేసిందని అన్నారు. అన్నింటికీ మించి భాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు తమ భాద్యతను ఏ విధంగా సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేరు చెప్పకుండా ప్రశ్నాస్త్రాన్ని సంధించాడు. అలాగే చాలా మంది భాద్యత వహిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని.. విమర్శించారు. దీనిపై ఘాటుగా స్పందించాడు ట్రంప్. ఒబామా ఓ చేతగాని అధ్యక్ష్యుడంటూ చేసిన కామెంట్‌ టాక్ ఆఫ్ ది అమెరికాగా మారింది.