నేడు కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao joined the Congress today
Tummala Nageswara Rao joined the Congress today

మాజీ మంత్రి ,బిఆర్ఎస్ మాజీ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇవాళ మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ను తమ పార్టీలోకి రా రమ్మని కాంగ్రెస్ నేతలు ఆహ్వానాలు పలకడంతో ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఈరోజు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 17న భారీ బహిరంగ సభ కు కూడా హాజరుకానున్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లో, ఖమ్మం లో పొంగులేటి, భట్టి విక్రమార్క లు తుమ్మల ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రా రమ్మని ఆహ్వానాలు పలికారు. ఈ తరుణంలోనే.. ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ లో తుమ్మలతో పాటు ఆయన అనుచరులు కూడా చేరనున్నారు.